https://oktelugu.com/

డ్యామిట్.. కథ అడ్డం తిరిగింది..

అరె ఏందిబై.. నాకేమైన రోగం వచ్చిందా..? మస్తు.. ఆరోగ్యంగా ఉన్నా.. మరో పదేళ్లు నేనే సీఎం.. కాదని.. ఎవరైనా కొత్త చర్చలు పెడితే.. కార్రుకాల్చి వాతపెడతా.. అయినా వినకుంటే.. చీరి బొందవెడతా.. ఇటీవల టీఆర్ఎస్ రాష్ట్రస్థాయి సమావేశంలో అధినేత కేసీఆర్ చేసిన కామెంట్స్ ఇవీ.. మరో పదేళ్లు తానే సీఎంగా ఉంటానని కేసీఆర్ గట్టిగా చెప్పేశారు. కేసీఆర్ వారసుడు.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ అయిన కేటీఆర్ సీఎం అవుతారనే రెండేళ్ల ప్రచారానికి తెర దింపేశారు. Also Read: […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 10, 2021 10:52 am
    Follow us on

    Telangana CM
    అరె ఏందిబై.. నాకేమైన రోగం వచ్చిందా..? మస్తు.. ఆరోగ్యంగా ఉన్నా.. మరో పదేళ్లు నేనే సీఎం.. కాదని.. ఎవరైనా కొత్త చర్చలు పెడితే.. కార్రుకాల్చి వాతపెడతా.. అయినా వినకుంటే.. చీరి బొందవెడతా.. ఇటీవల టీఆర్ఎస్ రాష్ట్రస్థాయి సమావేశంలో అధినేత కేసీఆర్ చేసిన కామెంట్స్ ఇవీ.. మరో పదేళ్లు తానే సీఎంగా ఉంటానని కేసీఆర్ గట్టిగా చెప్పేశారు. కేసీఆర్ వారసుడు.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ అయిన కేటీఆర్ సీఎం అవుతారనే రెండేళ్ల ప్రచారానికి తెర దింపేశారు.

    Also Read: వైఎస్ షర్మిల నూతన పార్టీకి కారణాలు ఇవేనా..

    రాష్ట్రంలో కొంతకాలంగా కేటీఆర్ సీఎం అవుతారనే చర్చ జోరుగా సాగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు కేటీఆర్ మంత్రాన్ని పఠించారు. కాబోయే ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకోవాలని పోటీ పడ్డారు. తండ్రీకొడుకుల తీరుపై కొంత అసంతృప్తితో ఉన్న ఈటల రాజేందర్ లాంటి వారుసైతం కేటీఆర్ జపం ఎత్తుకున్నారు. అంతా సజావుగా సాగిపోతుందనుకుంటున్న సమయంలో కేసీఆర్ రంగంలోకి దిగారు. కేటీఆర్ సీఎం అనే ప్రచారానికి తెర దింపండంటూ.. ఆదేశించారు. నిజంగానే ఆయన మనసులో అటువంటి ఆలోచన లేకుంటే.. ఈ భావనను తుంచేసేవారు. రెండేళ్లుగా ఉపేక్షించి.. ఇప్పటికిప్పుడు మరో పదేళ్లు.. తానే సీఎం అంటూ చెప్పుకోవడంలో అంతర్యం ఏమిటో అనే చర్చ జరుగుతోంది.

    కేసీఆర్ ఏ పని చేపట్టినా.. పదేళ్ల ముందుచూపు ఉంటుంది. నిర్ణయాలు వేగంగా తీసుకుంటారు. దీర్ఘకాల ప్రభావాలను అంచనా వేస్తారు. పరిస్థితులు ప్రతీకూలంగా ఉన్నాయనుకుంటే… ఉపసంహరించుకుంటారు. కేటీఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినప్పుడే పార్టీ లీడర్లు, క్యాడర్ కు సంకేతాలు ఇచ్చారు. తన తరువాత కేటీఆర్ తిరుగులేని నాయకుడని చెప్పేశారు. ఈ క్రమంలో పార్టీ కార్యకలాపాలు తగ్గించేసుకున్నారు. మరోవైపు ప్రభుత్వ కార్యక్రమాలు.. సమీక్షలను కేటీఆర్ నిర్వహిస్తున్నారు. ప్రజల దృష్టిలోనూ ఆయన సీఎం పీఠం ఎక్కడమే తరువాయి అనే ముద్ర పడిపోయింది. ఈ విషయమంతా.. కేసీఆర్ కు తెలిసిపోయింది. ఆశించిన విధంగా కేటీఆర్ ముఖ్యమంత్రిత్వం పై సరైన మద్దతు లభించడం లేదని కేసీఆర్ పసిగట్టారు. కేటీఆర్ కు పగ్గాలు ఇస్తే.. పార్టీ బలహీన పడుతుందేమోనన్న అనుమానంతో తానే రంగంలోకి దిగారు.

    Also Read: ఏపీలోని ఆ గ్రామంలో ఒక్క ఓటుకు 40 వేల రూపాయలు..?

    నిజానికి కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా జోరుగా పర్యటిస్తున్నారు. అయితే కేసీఆర్ కు ఉన్న ఇమేజ్ కేటీఆర్ కు దక్కడం లేదు. మరో వైపు కుటుంబం మొత్తం తెలంగాణపై పట్టు సాధిస్తుందనే భావన వ్యాపించింది. మరో వైపు బీజేపీ పుంజుకుంటున్న నేపథ్యంలో తాను పీఠం దిగి వారసుడికి ఇస్తే.. అసలుకే మోసం వస్తుందని గ్రహించిన కేసీఆర్ కేటీఆర్ పట్టాభిషేకాన్ని నిరవధిక వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్