https://oktelugu.com/

Chatrapathi: ‘ఛత్రపతి’ ఇంటర్వెల్ సన్నివేశం వెనుక ఇంత పెద్ద కథ ఉందా.. ఆడియన్స్ ని భలే మోసం చేసారుగా!

రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ప్రభాస్ చెప్పిన మాటలు విని అభిమానులకు ఫ్యూజులు ఎగిరే పరిస్థితి ఏర్పడింది. ఛత్రపతి ఇంటర్వెల్ బ్లాక్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. ప్రభాస్ కెరీర్ లో ది బెస్ట్ ఇంటర్వెల్ షాట్స్ లో ఛత్రపతి కచ్చితంగా ఉంటుంది. అయితే అంత మంది ఆర్టిస్టుల మధ్య భారీ డైలాగ్స్ చెప్పడం నా వల్ల కాదు అని రాజమౌళి తో షూటింగ్ సమయంలో అన్నాడట ప్రభాస్.

Written By:
  • Vicky
  • , Updated On : September 13, 2024 / 05:41 PM IST

    Chatrapathi

    Follow us on

    Chatrapathi: ప్రస్తుతం ఇండియా లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఎవరు అంటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు రెబెల్ స్టార్ ప్రభాస్. మన తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేసిన హీరోలలో ఒకడు ఆయన. అంతే కాదు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో షారుఖ్ ఖాన్ తర్వాత రెండు వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ సినిమాలు ప్రభాస్ సొంతం. ఇంత స్టార్ డమ్ ఎంజాయ్ చేస్తున్నప్పటికీ కూడా ప్రభాస్ లో ఇసుమంత గర్వం కూడా ఉండకపోవడం గమనార్హం. ఒక సాధారణమైన వ్యక్తి మాట్లాడితే ఎలా ఉంటుందో ప్రభాస్ మాట్లాడేటప్పుడు కూడా అలాగే ఉంటుంది. అయితే ప్రభాస్ కి పబ్లిక్ ఫంక్షన్స్ లో మాట్లాడడం ఎంత సిగ్గు అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మైక్ ని చూస్తే భయంతో పరుగులు తీసే స్వభావం ఆయనది. కల్కి మూవీ ప్రొమోషన్స్ లో కూడా మైక్ పట్టుకొని మాట్లాడేందుకు ప్రభాస్ ఎంత ఇబ్బంది పడేవాడో మనం సోషల్ మీడియా లో అనేక వీడియోస్ లో చూసే ఉంటాము.

    అలాంటి ప్రభాస్ గుంపులో ఉన్నప్పుడు ఒక షాట్ ఎలా చేయగలడు అనే సందేహం అభిమానుల్లో ఉండేది. దీనికి రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ప్రభాస్ చెప్పిన మాటలు విని అభిమానులకు ఫ్యూజులు ఎగిరే పరిస్థితి ఏర్పడింది. ఛత్రపతి ఇంటర్వెల్ బ్లాక్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. ప్రభాస్ కెరీర్ లో ది బెస్ట్ ఇంటర్వెల్ షాట్స్ లో ఛత్రపతి కచ్చితంగా ఉంటుంది. అయితే అంత మంది ఆర్టిస్టుల మధ్య భారీ డైలాగ్స్ చెప్పడం నా వల్ల కాదు అని రాజమౌళి తో షూటింగ్ సమయంలో అన్నాడట ప్రభాస్. మరి ఎలా చేస్తావు అని రాజమౌళి అడగగా, జస్ట్ పెదాలను కడుపుతాను, డబ్బింగ్ లో కవర్ చేస్తాను, సర్దుకో అని రాజమౌళి తో అన్నాడట ప్రభాస్. రాజమౌళి కూడా అందుకు ఓకే చెప్పాడు. అలా ప్రభాస్ ఆ సన్నివేశాన్ని డైలాగ్స్ పలకకుండా మూకీ తోనే అభినయించాడు. ఆ తర్వాత డబ్బింగ్ లో పవర్ ఫుల్ గా డైలాగ్స్ చెప్తూ కవర్ చేసాడు.

    ఇదే ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం. అంటే ఇలాంటి సన్నివేశాలు వచ్చినప్పుడు ప్రభాస్ ఇప్పటికీ అలాగే చేస్తాడు అన్నమాట. ఇంత పెద్ద సూపర్ స్టార్ అయ్యుండి కూడా ఇప్పటికీ భయం, బెరుకు పబ్లిక్ ఫంక్షన్స్ లో మాట్లాడేటప్పుడు ప్రభాస్ లో కనిపిస్తుంది కాబట్టి, ఇలాంటి సన్నివేశాలు వచ్చినప్పుడు ఆయన ఇదే ఫార్ములా ని ఇప్పటికీ అనుసరించడం లో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఇక ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్ చిత్రం లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మారుతీ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 10 వ తారీఖున విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ సినిమాతో పాటు ఆయన కల్కి 2 , సలార్ 2, స్పిరిట్, హను రాఘవపూడి తో ఒక సినిమా చేయబోతున్నాడు.