https://oktelugu.com/

Balakrishna: బాలయ్య బాబీ సినిమా ఆ సూపర్ హిట్ సినిమాకు కాపీ గా తెరకెక్కుతుందా..?

మాస్ హీరోల్లో బాలయ్య బాబుకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన చేసే సినిమాలన్నీ మాస్ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి. అందుకే ఆయనకు బీ,సీ సెంటర్లో చాలా మంచి క్రేజ్ అయితే దక్కుతూ ఉంటుంది. తద్వారా ఆయన సినిమాలకు భారీ వసూళ్లు కూడా వస్తూ ఉంటాయి...

Written By:
  • Vicky
  • , Updated On : September 13, 2024 / 05:51 PM IST

    Balakrishna

    Follow us on

    Balakrishna: నందమూరి నటసింహాంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు బాలయ్య బాబు… కెరియర్ మొదట్లోనే చాలా వైవిధ్యమైన పాత్రలను చేశాడు. ఇక ఇప్పుడు అన్ని మాస్ సినిమాలను చేసుకుంటూ తన పేరు ప్రఖ్యాతలను పెంచుకునే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాల విషయంలో కూడా చాలా ఆచితూచి అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నాడు. అయినప్పటికి ఆయన బాబీ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి బాలయ్య బాబు గతంలో చేసిన ఒక సినిమాకి మధ్య సిమిలారిటి ఉందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిజానికి బాలయ్య బాబు కెరియర్లో చాలా మాస్ సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. ఇక వి వి వినాయక్ చేసిన చెన్నకేశవరెడ్డి సినిమాతో భారీ సక్సెస్ ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని కూడా క్రియేట్ చేసింది. ఇక బాలకృష్ణ చేసిన చెన్న కేశవరెడ్డి సినిమా కథకి ఇప్పుడు బాబీ చేయబోయే సినిమా కథకి చాలా దగ్గరి పోలికలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఒక రకంగా చెప్పాలంటే చెన్నకేశవరెడ్డి సినిమాను కాపీ చేసి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు అంటూ బాబీ మీద పలు రకాల విమర్శలైతే వస్తున్నాయి.

    ఇక సోషల్ మీడియా వేదికగా కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. మరి బాలయ్య బాబు సినిమానే మళ్లీ రిపీట్ చేసి సినిమా చేస్తున్నాడా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక మొత్తానికైతే కమర్షియల్ సినిమాలను తీయడంలో బాబీ చాలా మంచి దర్శకుడనే చెప్పాలి.

    ఇక ఇంతకుముందు చిరంజీవికి ‘వాల్తేరు వీరయ్య ‘ సినిమాతో భారీ సక్సెస్ ని అందించిన ఆయన ఇప్పుడు బాలయ్య బాబు కి ఒక సూపర్ హిట్ ను అందించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది… అందులో భాగంగానే ఆయన ఈ సినిమా మీద చాలా ఎక్కువ ఫోకస్ చేసి ముందుకు సాగుతున్నాడు. ఇక బాబీ ఈ సినిమాను తొందరగా ఫినిష్ చేసి రిలీజ్ చేసి భారీ సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు.

    ఈ సినిమాతో కనక సక్సెస్ ని అందుకుంటే బాబీ మరోసారి స్టార్ హీరోలతో సినిమాలను చేసే అవకాశాలు కూడా వస్తాయి. ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాను చేసిన ఆయన ఆ సినిమాతో ఒక డిజాస్టర్ ని మూటగట్టుకున్నాడు. అలాగే ఎన్టీయార్ తో ‘జై లవకుశ ‘ సినిమా చేసి భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు…