Janhvi Kapoor: టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘దేవర’ సినిమా మేనియా నే కనిపిస్తుంది. సుమారుగా ఆరేళ్ళ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుండి విడుదలైన సోలో హీరో మూవీ ఇది. #RRR తో గ్లోబల్ వైడ్ గా ఎన్టీఆర్ మంచి క్రేజ్ సంపాదించుకున్న తర్వాత విడుదల అవ్వబోతున్న సినిమా కావడంతో ఈ చిత్రం పై ప్రారంభ దశ నుండే అంచనాలు భారీ గా ఏర్పడ్డాయి. ఈ సినిమా దర్శకుడు కొరటాల శివ గత చిత్రం ‘ఆచార్య’ ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అయినప్పటికీ కూడా ఎన్టీఆర్ కి ఉన్న మాస్ క్రేజ్ కారణంగా ఈ సినిమాకి రికార్డు స్థాయి బిజినెస్ జరిగింది. కేవలం తెలుగు రాష్ట్రాల నుండే ఈ సినిమాకి 120 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగిందట. ఇది ఆల్ టైం రికార్డు కాకపోయినప్పటికీ ప్రతీ రూపాయి ఎన్టీఆర్ పేరు మీదనే బిజినెస్ జరిగిందని చెప్పొచ్చు.
అయితే రికార్డు స్థాయిలో బిజినెస్ జరగకపోవడానికి కారణం రీసెంట్ గా ఈ సినిమా నుండి విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ అని కూడా అంటున్నారు విశ్లేషకులు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా ద్వారానే శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ మన టాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈమె అందానికి ఇప్పటికే కుర్రాళ్ళు ఫిదా అయిపోయారు. దేవర చిత్రంలోని ‘చుట్టమల్లే’ సాంగ్ లో ఈమె అందానికి ముగ్దులు అవ్వని కుర్రాళ్ళు ఉండరు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ట్రైలర్ లో ఈమె మాట్లాడిన తెలుగు యాస కి ఆడియన్స్ షాక్ అయ్యారు. జాన్వీ కపూర్ కి ఇంత తెలుగు ఇప్పుడొచ్చింది, అది కూడా నెల్లూరు, సీమ ప్రాంతం మధ్యలో నివసించే జనాలు మాట్లాడే యాస ఆమెకి ఎలా సాధ్యపడింది అని ఆశ్చర్యపోయారు. కానీ అది జాన్వీ కపూర్ గొంతు కాదని లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త. యాంకర్ గా నటిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ ఈ పాత్రకు డబ్బింగ్ చెప్పిందని తెలుస్తుంది.
గతం లో కూడా అనసూయ ‘వేదం’ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించిన దీక్షా సేథ్ కి డబ్బింగ్ చెప్పింది. ఆ సినిమా తర్వాత పలువురి హీరోయిన్స్ కి కూడా అనసూయ డబ్బింగ్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ‘దేవర’ జాన్వీ కపూర్ కి కూడా ఆమె డబ్బింగ్ చెప్పింది అంటున్నారు. దీనికి మూవీ టీం నుండి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు, సోషల్ మీడియా లో విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తపై కూడా అనసూయ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు, కనీసం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అయినా క్లారిటీ వస్తుందో లేదో చూడాలి. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ నెల 22 లేదా, 25 వ తారీఖున జరిపించాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.