https://oktelugu.com/

Bigg Boss 5 Telugu: షణ్ముఖ్ కి టైటిల్ దూరం అవ్వడానికి కారణం అదేనా…

Bigg Boss 5 Telugu: ఆద్యంతం ప్రేక్షకులను అలరించిన బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 ముగిసింది. అందరూ ఊహించినట్టుగానే సన్నీ విజేతగా నిలిచాడు. రన్నరప్‌గా షన్ను నిలవడం నిజంగా ఆశ్చర్యపరిచే అంశమే. ఆ స్థానంలో అందరూ శ్రీరామ్‌ ఉంటాడని భావించారు. అయితే ఇప్పుడు తాజాగా షన్ను సెకండ్ ప్లేస్ లో రావడానికి గల కారణలపై అంతా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే సన్నీతో పోల్చుకుంటే బిగ్‌బాస్ హౌస్‌లోకి రాకముందు షన్నుకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. దీంతో షో మొదలైనప్పటి నుంచే […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 20, 2021 / 09:28 AM IST
    Follow us on

    Bigg Boss 5 Telugu: ఆద్యంతం ప్రేక్షకులను అలరించిన బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 ముగిసింది. అందరూ ఊహించినట్టుగానే సన్నీ విజేతగా నిలిచాడు. రన్నరప్‌గా షన్ను నిలవడం నిజంగా ఆశ్చర్యపరిచే అంశమే. ఆ స్థానంలో అందరూ శ్రీరామ్‌ ఉంటాడని భావించారు. అయితే ఇప్పుడు తాజాగా షన్ను సెకండ్ ప్లేస్ లో రావడానికి గల కారణలపై అంతా ఆలోచిస్తున్నారు.

    ఎందుకంటే సన్నీతో పోల్చుకుంటే బిగ్‌బాస్ హౌస్‌లోకి రాకముందు షన్నుకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. దీంతో షో మొదలైనప్పటి నుంచే షన్నుయే విజేత అనుకున్నారు జనాలు. యూట్యూబ్ వీడియోలతో లక్షల కొద్దీ అభిమానులను సంపాదించుకున్నాడు. ‘అరె ఏంట్రా ఇది’ డైలాగుతో చాలా ఫేమస్ అయిపోయాడు షణ్ముఖ్.

    కాగా షన్ను ఆటాడినట్టు ఎక్కడా కనిపించలేదు. సిరిని అతుక్కుని తిరగడానికే ఆయన మొదటి ప్రాధాన్యత ఇచ్చాడు. షన్ను విజేతగా నిలవకపోవడంతో ఆయన అభిమానులంతా నిరాశలో ఉండడంతో పాటూ, సిరిపైనే కోపంగా ఉన్నట్టు సమాచారం. అతడి ప్రవర్తన హౌస్ మేట్స్ నే కాదు చూసే జనాలకు కూడా చిర్రెత్తుకొచ్చేలా తయారైంది. అతని ప్రియురాలు దీప్తి సునయన కూడా షన్నును సపోర్ట్ చేసినట్టు ఎక్కడా కనిపించలేదు. ఇన్ స్టా లో మాత్రం ‘అతడిని అతడిలా ఆడనివ్వండి’ అంటూ కామెంట్ చేసి సైలెంట్ అయ్యింది.

    Also Read: ‘అరే ఎంట్రా ఇదీ’.. షణ్నును కావాలనే ఓడించారా?

    రెండు వారాల క్రితం కుటుంబసభ్యులను వచ్చి షణ్ముక్ తల్లి వచ్చి అతడికి, సిరికి ‘గేమ్‌ను గేమ్‌లా ఆడండి, మరీ ఎమోషనల్ అయిపోవద్దు’ అంటూ స్వీట్ గా వార్నింగ్ ఇచ్చినా మారకుండా అలానే చేస్తూ వచ్చారు. ప్రతిసారి ఇద్దరూ హగ్ పేరుతో అతుక్కోవడం… ‘ఫ్రెండ్లీ హగ్’ అని చెప్పుకోవడంతో ‘హగ్గుల స్టార్’ అనే పేరు తెచ్చుకున్నాడు. ఈ కారణం గానే అతనికి టైటిల్ దూరం అయ్యిందిన్ అని అందరూ భావిస్తున్నారు.

    Also Read: Bigg Boss 5: షణ్ముఖ్ కి టైటిల్ దూరం అవ్వడానికి కారణం అదేనా…