Director Sukumar: ప్రముఖ దర్శకుడు సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన శైలిలో సినిమాలు తెరకెక్కిస్తూ టాలీవుడ్ లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. హీరో విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు దర్శకుడు సుకుమార్. కానీ ఆయన ‘పుష్ప’ సినిమాను ఎప్పుడైతే రెండు భాగాలుగా తీయాలని నిర్ణయించుకున్నారో… ఇక విజయ్ దేవరకొండ సినిమా ఉండదేమోననే రుమర్లు వినిపించాయి. ఇక మరోపక్క విజయ్ కూడా వేరే ప్రాజెక్ట్ లు ఒప్పుకుంటుండడంతో వీరి కాంబినేషన్ లో సినిమా ఆగిపోయిందంటూ ప్రచారం జరిగింది.

కానీ అందులో నిజం లేదని తెలుస్తోంది. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు సుకుమార్. ఇటీవల ఆయన డైరెక్ట్ చేసిన ‘పుష్ప’ సినిమా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు ఈ సినిమా రూ.71 కోట్ల గ్రాస్ ను సాధించినట్లు నిర్మాతలు అధికారికంగా వెల్లడించారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన సుకుమార్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘పుష్ప’ సినిమా సెకండ్ పార్ట్ వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుందని 2022 దసరా కానుకగా సినిమాను విడుదల చేయబోతున్నట్లు చెప్పారు.
Also Read: పూరి చేసిన తప్పే సుకుమార్ చేయడం లేదు కదా?
ఇదే సమయంలో ఆయనకు విజయ్ దేవరకొండ సినిమాకి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. ‘పుష్ప’ సినిమా షూటింగ్ పూర్తయిన తరువాతే విజయ్ దేవరకొండ సినిమాను మొదలుపెట్టగలనని అన్నారు. ప్రస్తుతం విజయ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ సినిమాలో నటిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా 2022 ఆగస్టులో విడుదల కానుంది. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో మైక్ టైసన్ కీలకపాత్రలో కనిపించనున్నారు.
Also Read: భయంలో విజయ్ దేవరకొండ.. డేట్స్ ఇవ్వాలా ? హ్యాండ్ ఇవ్వాలా ?