https://oktelugu.com/

Prabhas: ప్రభాస్ “ప్రాజెక్ట్ కే” అప్డేట్… ఫుల్ జోష్ లో డార్లింగ్ అభిమానులు

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ లో దూసుకుపోతున్నారు. బాహుబలి ఘన విజయం సాధించిన తర్వాత ప్రభాస్ అన్నీ పాన్ ఇండియా సినిమాల్లోనే నటిస్తుండడం విశేషం. కాగా ఆయన నటిస్తున్న రాధే శ్యామ్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే మరోవైపు ఆయన అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే తో కలిసి నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ “ప్రాజెక్ట్ కే”. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 10, 2021 / 01:00 PM IST
    Follow us on

    Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ లో దూసుకుపోతున్నారు. బాహుబలి ఘన విజయం సాధించిన తర్వాత ప్రభాస్ అన్నీ పాన్ ఇండియా సినిమాల్లోనే నటిస్తుండడం విశేషం. కాగా ఆయన నటిస్తున్న రాధే శ్యామ్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే మరోవైపు ఆయన అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే తో కలిసి నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ “ప్రాజెక్ట్ కే”. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వైజయంతి మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

    interesting news about prabhas and nag aswin project k movie

    Also Read: ఆర్ఆర్ఆర్ అలా.. రాధేశ్యామ్ ఇలా.. మధ్యలో భీమ్లానాయక్.. ఎవరికి కలిసివస్తుంది?

    ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కోసం దీపికా హైదరాబాద్ కు చేరుకుంది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో షూటింగ్ జరుగుతుండగా… ప్రభాస్ ఈరోజు “ప్రాజెక్ట్ కే” షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఈ విషయం బయటకు రావడంతో డార్లింగ్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉదయం నుంచే సోషల్ మీడియా లో “ప్రాజెక్ట్ కే” చిత్రాన్ని ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మేజర్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతుండగా, ఇందులో ప్రభాస్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం. ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ కోసం దాదాపుగా 12 నుంచి 13 నెలల షూటింగ్ ను ప్లాన్ చేశారట మేకర్స్. ప్రభాస్ సైతం మూవీ కోసం బల్క్ డేట్స్ కేటాయించారట. ఈ సినిమాతో పాటు ఆదిపురుష్,  సలార్, స్పిరిట్ చిత్రాల్లో ప్రభాస్ నటిస్తున్నాడు.

    Also Read: మరో అరుదైన ఘనత సాధించిన ప్రభాస్… ఆసియా లోనే నెం.1