TRS: టీఆర్ఎస్‌కు ఇంత భయమా.. అందుకే క్యాంపు రాజకీయాలు?

TRS: టీఆర్ఎస్..తెలంగాణలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదు.. తిరుగులేని రాజకీయ శక్తి అని చాలా సార్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. కానీ, హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితంతో టీఆర్ఎస్‌లో ఓటమి భయం స్టార్ట్ అయిందన్న పరిస్థితులను కనబడుతున్నాయి. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ పార్టీ సొంత పార్టీ ఓటర్ల కోసం క్యాంపు రాజకీయాలు చేసే స్థితికి వెళ్లింది. అధికార టీఆర్ఎస్ క్యాంపు రాజకీయాలు, వ్యూహాత్మక నిర్ణయాలపై […]

Written By: Neelambaram, Updated On : December 10, 2021 12:59 pm
Follow us on

TRS: టీఆర్ఎస్..తెలంగాణలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదు.. తిరుగులేని రాజకీయ శక్తి అని చాలా సార్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. కానీ, హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితంతో టీఆర్ఎస్‌లో ఓటమి భయం స్టార్ట్ అయిందన్న పరిస్థితులను కనబడుతున్నాయి. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ పార్టీ సొంత పార్టీ ఓటర్ల కోసం క్యాంపు రాజకీయాలు చేసే స్థితికి వెళ్లింది. అధికార టీఆర్ఎస్ క్యాంపు రాజకీయాలు, వ్యూహాత్మక నిర్ణయాలపై స్పెషల్ ఫోకస్..

TRS

టీఆర్ఎస్ పార్టీకి ఓటమి కొత్త కాదని ఆ పార్టీ నేతలు బయటకు చెప్తున్నారు. కానీ, లోలోపల మాత్రం ఓటమి భయం పట్టుకుంందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక తెలంగాణలో జరిగే 6 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ విషయం స్పష్టమవుతున్నది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన అత్యధిక ప్రజాప్రతినిధులు జిల్లాల్లో ఉన్నారు. కానీ, వారు అందరూ అధికార పార్టీ అభ్యర్థులకే ఓటేస్తారన్న నమ్మకం పార్టీకి లేదు. అందుకే ప్రజా ప్రతినిధులను కర్నాటకకు, ఆ తర్వాత తిరుపతి ఇతర ప్రాంతాల్లోని రిసార్టులకు తీసుకెళ్లారు. క్యాంపులకు తీసుకెళ్లి మరీ.. ఓటింగ్ సమయానికి తీసుకొచ్చారు.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీల గెలుపు కోసం గులాబీ పార్టీ నేతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. పోలింగ్ కేంద్రాలకు ప్రజా ప్రతినిధులను లెక్కలేసుకుని మరీ పంపుతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఈ క్యాంపు రాజకీయాలు జరిగాయి. పోలింగ్ కేంద్రానికి బస్సుల ద్వారానే తరలిస్తున్నారు. మొత్తంగా సొంత పార్టీ నేతలపైన అధినాయకత్వానికి నమ్మకం లేదని చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. విపక్ష పార్టీలకూ, స్వతంత్ర అభ్యర్థులకు టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఓటేస్తారనే అనుమానంతోనే అధికార టీఆర్ఎస్ ఇలా క్యాంపు రాజకీయాలు చేస్తోంది.

Also Read: TRS MPs: టీఆర్ఎస్ ఎంపీల వ్యూహం బెడిసి కొట్టిందా?

హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న సర్దార్ రవీందర్ సింగ్‌కు ఓటేయాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానంపై అధికార పార్టీ దృష్టి పెట్టింది. ఆ ఒక్క స్థానమే కాదు.. మిగతా ఐదు స్థానాల్లోనూ అధికార టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఫుల్ ఫోకస్ పెట్టింది. ఎట్టి పరిస్థితుల్లోనూ క్రాస్ ఓటింగ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ నేతలకు అధిష్టానం ఆదేశాలిచ్చిందని సమాచారం. ఈ క్రమంలోనే క్యాంపు రాజకీయాలు రసవత్తరంగా సాగాయి. మొత్తంగా సొంత పార్టీ నేతలనే కొనుక్కునే స్థితికి అధికార గులాబీ పార్టీ వచ్చింది. చూడాలి మరి.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతాయో..

Also Read: AP cabinet expansion: మంత్రివర్గ విస్తరణపై జగన్ ఎందుకు ముందడుగు వేయడం లేదు?

Tags