https://oktelugu.com/

#Ban Ipl: ట్రెండింగ్ లో ‘బ్యాన్ ఐపీఎల్’.. టీమిండియా ఓటమికి ఐపీఎల్ కారణమా?

#Ban Ipl:విదేశీ సిరీస్ లలో అదరగొడుతారు. ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో మట్టి కరిపించి ఔరా అనిపిస్తారు.ఇంగ్లండ్ ను ఇంగ్లండ్ వెళ్లి చిత్తు చేస్తారు. ద్వైపాక్షిక సిరీస్ లలో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తారు. ఐపీఎల్ లో సిక్సర్ల మీద సిక్సర్లు కొడుతూ ఔరా అనిపిస్తారు. కానీ ప్రపంచకప్ టోర్నీలకు వచ్చేసరికి మందులేని చిచ్చుబుడ్డీలా తుస్సుమంటారు. ప్రపంచకప్ టీ20లో టీమిండియా ఓటమిపై ఇప్పుడు భారత అభిమానులు రగిలిపోతున్నారు. సోషల్ మీడియా ఈ ఓటములకు కారణం ‘ఐపీఎల్’ అని నిందిస్తూ #Ban IPL […]

Written By:
  • NARESH
  • , Updated On : November 1, 2021 / 05:09 PM IST
    Follow us on

    #Ban Ipl:విదేశీ సిరీస్ లలో అదరగొడుతారు. ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో మట్టి కరిపించి ఔరా అనిపిస్తారు.ఇంగ్లండ్ ను ఇంగ్లండ్ వెళ్లి చిత్తు చేస్తారు. ద్వైపాక్షిక సిరీస్ లలో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తారు. ఐపీఎల్ లో సిక్సర్ల మీద సిక్సర్లు కొడుతూ ఔరా అనిపిస్తారు. కానీ ప్రపంచకప్ టోర్నీలకు వచ్చేసరికి మందులేని చిచ్చుబుడ్డీలా తుస్సుమంటారు. ప్రపంచకప్ టీ20లో టీమిండియా ఓటమిపై ఇప్పుడు భారత అభిమానులు రగిలిపోతున్నారు. సోషల్ మీడియా ఈ ఓటములకు కారణం ‘ఐపీఎల్’ అని నిందిస్తూ #Ban IPL బ్యాన్ ఐపీఎల్ అనే హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేస్తున్నారు.

    ban ipl

    భారత అభిమానుల ఆవేదనకు, ఆగ్రహానికి కారణం ఉంది. ఎన్నో జట్లపై అరవీర భయంకరంగా గెలిచే టీమిండియా ప్రపంచకప్ టోర్నీ గెలవక 8 ఏళ్లు అవుతోంది. అప్పుడెప్పుడో ధోని సారథ్యంలో టీమిండియా గెలిచింది. ఆ తర్వాత కోహ్లీ సారథ్యంలో ఒక్క కప్ కొట్టలేదు. ఇప్పుడు ధోని మెంటర్ గా ఉన్నా కూడా సాధించడం లేదు.

    ప్రస్తుతం దుబాయ్ లో ప్రపంచకప్ టీ20 ఆడుతున్న టీమిండియా నిన్న న్యూజిలాండ్ తో మ్యాచ్ లోచిత్తయ్యింది. 6 నుంచి 16 ఓవర్ల మధ్య ఒక్క బౌండరీ కూడా కొట్టలేదంటే మన వాళ్ల తడ‘బ్యాటు’ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరీ తీసికట్టుగా ఆడేశారు.

    అయితే దీనంతటికి కారణం ఐపీఎల్ అని.. అక్కడ డబ్బుల కోసం ఆడిన ఆటగాళ్లు ఇక్కడ దేశం కోసం కలిసి కట్టుగా ఆడడం లేదని.. ఐపీఎల్ అలసట కూడా టీమిండియాను ముంచేసిందని ఆడిపోసుకుంటున్నారు. ముఖ్యంగా కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా గెలవదని.. ఐపీఎల్ లో అయినా.. ప్రపంచకప్ లో అయినా టీమిండియా కప్ కొట్టడం కష్టమని విమర్శిస్తున్నారు. కోహ్లీని కెప్టెన్సీ నుంచి తొలగించాలంటూ ట్రోల్స్ చేస్తున్నారు. కానీ పాకిస్తాన్ తో మ్యాచ్ లో అందరూ విఫలమైతే నిలబడి కొట్టింది కోహ్లీనే అని ఇక్కడ మనం గుర్తించాలి. జట్టు మొత్తం ఆడితేనే గెలుస్తారు. ఒక్క కోహ్లీనే ఆడితే గెలవదన్న వాస్తవాన్ని మనం అందరం గమనించాలి.

    నిజానికి ఐపీఎల్ వల్లే ఎంతో మంది ప్రతిభ గల ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. జస్ప్రీత్ బుమ్రా, హార్ధిక్ పాండ్యా, నిన్నటికి నిన్న వరుణ్ చక్రవర్తి కూడా ఐపీఎల్ లో మిస్టరీ స్పిన్నర్ గా ఎదిగి టీమిండియాలోకి ఎంపికయ్యాడు. ఇతడే కాదు రుతురాజ్ గైక్వాడ్, దేదవత్ పడిక్కల్, సంజు శాంసన్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్, ఇషాన్ కిషన్ లాంటి వారు ఇప్పుడు టీమిండియాకు ఆడుతున్నారంటే ఐపీఎల్ వల్లే.

    అయితే ఐపీఎల్ వల్లే టీమిండియా ఇలా ఓడిపోతుందని అభిమానులు ‘బ్యాన్ ఐపీఎల్’ అంటూ ఉద్యమిస్తున్నారు. నిన్నటి నుంచి ఐపీఎల్ లో ట్రెండ్ అవుతోంది. ఆటగాళ్ల మైండ్ సెట్ మారన్నంత వరకూ టీమిండియాకు విజయాలు దక్కవు. దుబాయ్ లో పరిస్థితులు టాస్ కీలకంగా ఉంది. మనమే కాదు.. ఆస్ట్రేలియా, వెస్టిండీస్ లాంటి టాప్ జట్లు కూడా టీమిండియా లాగానే ఓడిపోయాయి. సో ఇండియాలో జరగాల్సిన ప్రపంచకప్ టీ20ని దుబాయ్ కు తరలించి ఇప్పుడు ఇండియా చేజుతులా ఆ పిచ్ ల వల్ల ఓడిపోయిందన్న మాట వినిపిస్తోంది.