https://oktelugu.com/

Sankranthi Release Movies: రాధేశ్యామ్ స‌హా సంక్రాంతికి వ‌స్తున్న సినిమాలు ఇవే..

Sankranthi Release Movies:  తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అంటేనే సినిమాల‌కు పెద్ద పండుగ‌. సంక్రాంతికి వ‌చ్చే సినిమాల‌కు పెద్ద క‌లెక్ష‌న్స్ వ‌స్తాయ‌న్న విష‌యం తెలిసిందే. అయితే ఈ సంక్రాంతికి మోస్ట్ వెయిటెడ్ సినిమా ఆర్ ఆర్ ఆర్ వ‌స్తుంద‌ని ఎంత‌గానో ఎదురు చూసినా.. చివ‌ర‌కు క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది. ఇక ప్ర‌భాస్ మూవీ రాధే శ్యామ్ కూడా వ‌స్తుందో లేదో క్లారిటీ లేదు. ఇప్ప‌టికి అయితే పండ‌క్కి వ‌స్తున్న అతి పెద్ద మూవీ ఇదే. అయితే […]

Written By:
  • Mallesh
  • , Updated On : January 4, 2022 / 04:42 PM IST

    Radhe Shyam Budget and Remuneration

    Follow us on

    Sankranthi Release Movies:  తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అంటేనే సినిమాల‌కు పెద్ద పండుగ‌. సంక్రాంతికి వ‌చ్చే సినిమాల‌కు పెద్ద క‌లెక్ష‌న్స్ వ‌స్తాయ‌న్న విష‌యం తెలిసిందే. అయితే ఈ సంక్రాంతికి మోస్ట్ వెయిటెడ్ సినిమా ఆర్ ఆర్ ఆర్ వ‌స్తుంద‌ని ఎంత‌గానో ఎదురు చూసినా.. చివ‌ర‌కు క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది. ఇక ప్ర‌భాస్ మూవీ రాధే శ్యామ్ కూడా వ‌స్తుందో లేదో క్లారిటీ లేదు. ఇప్ప‌టికి అయితే పండ‌క్కి వ‌స్తున్న అతి పెద్ద మూవీ ఇదే. అయితే దీనితో పాటు మ‌రిన్ని చిన్న సినిమాలు సంద‌డి చేయ‌నున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

     

    Sankranthi Release Movies

    రాధే శ్యామ్ జనవరి 14న రాబోతోంది. ఇక దీని త‌ర్వాత టాలీవుడ్ కింగ్ నాగార్జునతో పాటు చైత‌న్య న‌టిస్తున్న బంగార్రాజు మూవీ 15న వ‌స్తోంది. ఈ మూవీ టీజ‌ర్‌కు భారీ రెస్పాన్స్ వ‌స్తోంది. కృతి శెట్టి, రమ్యకృష్ణ హీరోయిన్లుగా చేస్తున్నారు. ఇక దీని త‌ర్వాత రౌడీ బాయ్స్ మూవీతో దిల్ రాజు వారసుడు ఆశిష్ రెడ్డి ఇండ‌స్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఇక దీని త‌ర్వాత మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ న‌టించిన హీరో మూవీ కూడా 15న వ‌స్తోంది.

    Also Read:  బాలయ్య అన్ స్టాపబుల్ షో కి రానున్న ఆ హీరో… ఎవరో తెలిస్తే షాక్ అవ్వడం పక్కా!

    ఇక 7 డేస్ 6 నైట్స్ అనే మూవీని తెర‌కెక్కించారు సీనియర్ నిర్మాత ఎమ్మెస్ రాజు. ఇది కూడా పొంగల్‌కే వ‌స్తోంది. ఇక మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ చేస్తున్న సూపర్ మచ్చి మూవీ కూడా 14న వ‌స్తోంది. సిద్ధూ జొన్నలగడ్డ న‌టించిన డిజే టిల్లు కూడా 14నే రాబోతోంది. ఆది సాయికుమార్ మూవీ అతిధి దేవోభవ కూడా సంక్రాంతి రేసులో ఉంది. ఇక త‌మిళ హీరో విశాల్ న‌టించిన సామాన్యుడు మూవీ కూడా 14న వ‌స్తోంది.

    అజిత్ న‌టించిన వలిమై కూడా 13న రానుంది. ఇందులో యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో కార్తికేయ విలన్‌గా చేస్తున్నాడు. దీని మీద భారీగానే అంచ‌నాలు ఉన్నాయి. దీనితో పాటు వేయి శుభములు కలుగునీకు లాంటి మూవీ కూడా 7న వ‌స్తోంది. ఇక ట్యాలెంటెడ్ హీరో రానా దగ్గుబాటి న‌టించిన 1945 కూడా 7న వ‌స్తుంది. మొత్తానికి ఆర్ ఆర్ ఆర్ లాంటి భారీ మూవీకి క‌లిసిరాని సంక్రాంతి ఈ సినిమాల‌కు ఏ మాత్రం క‌లిసి వ‌స్తుందో చూడాలి.

    Also Read: 100 కోట్ల ఆఫర్ ను వద్దన్న బిగ్ బాస్ విన్నర్ సన్నీ… రీజన్ ఏంటంటే ?

    Tags