Toby: ప్రస్తుతం కన్నడ సినిమా ఇండస్ట్రీ క్వాలిటీ సినిమాలని తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాలు చాలా వరకు సక్సెస్ అవుతున్నాయి.ఇక శాండిల్ వుడ్ నుంచి వచ్చిన కేజిఎఫ్, కాంతారా లాంటి సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో తమ సత్తాను చాటుకొని సక్సెస్ ఫుల్ సినిమాలు గా మంచి గుర్తింపుని సంపాదించుకుంటున్నాయి. ఇక ఇదిలా ఉంటే కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చే చిన్న సినిమాలు మాత్రం ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్నాయి.
ముఖ్యంగా ఓటిటి ప్లాట్ ఫామ్ లో తమ సత్తా ఏంటో చాటడానికి రెఢీ అవుతున్నాయి. ఇక అదే రీతిలో ఇప్పుడు రాజ్ బి శెట్టి దర్శకత్వంలో వచ్చిన టోబీ సినిమా కూడా ప్రేక్షకులను అలరించడానికి ఓటిటి ప్లాట్ఫారంలో స్ట్రీమింగ్ అవుతుంది…నిజానికి ఈ సినిమా ఆగస్టు 25వ తేదీన థియేటర్ లో రిలీజ్ అయినప్పటికీ ఈ సినిమా ఓటిటి ప్లాట్ఫారంలో ఎప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ చాలామంది అభిమానులు చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు… కన్నడ ఇండస్ట్రీలో రాజ్ బి శెట్టికి చాలా మంచి పేరు ఉంది. ఆయన చిన్న సినిమాలను తెరకెక్కించి పెద్ద సక్సెస్ లు కొట్టడంలో సిద్ధహస్తుడు. అందుకే ఆయన నటించి డైరెక్షన్ చేసిన సినిమా థియేటర్ లోకి వస్తుందంటే అభిమానులు అందరూ ఆ సినిమాను చూడడానికి చాలా ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ ఉంటారు…
ఇక ఆయన డైరెక్షన్ లో ఇంతకు ముందు వచ్చిన గరుడ గమన వృషభ వాహన సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆయన డైరెక్టర్ గా, రైటర్ గా, నటుడి గా అన్ని రంగాలలో తన సత్తా చాటుకుంటూ వస్తున్నాడు. ఇక ఇతనికి రక్షిత్ శెట్టి, రిషబ్ శెట్టి లు మంచి స్నేహితులవడం విశేషం…
అయితే ఇప్పుడు ఓటిటి లోకి వచ్చిన టోబి సినిమా కథ ఏంటి అంటే ఒక చిన్న పిల్లవాడు అమ్మ నాన్నల నుంచి దూరంగా అనాధ లాగా పెరుగుతూ ఉంటాడు.ఆయన ఎవరికి తెలియదు టోబి అనే పేరుని అతనికి పెట్టడం వాళ్ల అందరు అతన్ని టోబి అని పిలుస్తూ ఉంటారు. అయితే ఆయన ఒక డిఫరెంట్ మెంటాలిటీతో ఉంటాడు.
ఆయనకి కోపం ఎక్కువగా వస్తే ఎవరైనా సరే మర్డర్ చేసేస్తాడు. అలాంటి ఒక వ్యక్తిని కొంతమంది వాళ్ల స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటారు. వాళ్ల నుంచి ఎలా విముక్తి చెందాడు అలాగే వాళ్ళు తనని వాడుకున్నారు అని తెలిసిన తర్వాత ఆయన వాళ్ళని ఏం చేశాడు అనే కథాంశం తో ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమా ప్రస్తుతం సోనీ లీవ్ లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా చూడడానికి ప్రేక్షకులు విపరీతంగా అసక్తి చూపిస్తున్నారు అంటే సినిమా ఎంత బావుందో మనం అర్థం చేసుకోవచ్చు…