Jawan Movie: ఓరి నీ.. ‘జవాన్’లో అక్కడుంది షారుఖ్ ఖాన్ కాదా? మరెవరు?

సినిమాల్లో నటించే కొందరు హీరోలకు డూప్ లు ఉంటారన్న విషయం చాల మందికి తెలుసు. కానీ వారి వివరాలు బయటకు రావు. గతంలో హీరోలు డ్యూయెల్ రోల్ ఎలా చేశారబ్బా? అని అయోమయానికి గురయ్యేవారు.

Written By: Chai Muchhata, Updated On : September 11, 2023 8:54 am

Jawan Movie

Follow us on

Jawan Movie: దశాబ్దాలుగా సినీ ప్రేక్షకులను అలరిస్తున్న షారుఖ్ ఖాన్ నేటి కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నాడు. బాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా లెవల్లో ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే ఆయన నటించిన సినిమాలో దాదాపు సక్సెస్ అవుతూ ఉంటాయి. బాలీవుడ్ బాద్షా రీసెంట్ గా నటించిన ‘జవాన్’ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ఈ మూవీ రెండు రోజుల్లోనే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. ఈ నేపథ్యంలో షారుఖ్ కు వరల్డ్ వైడ్ గా ప్రశంసలు దక్కుతున్నారు. ఈ తరుణంలో షారుఖ్ ఖాన్ కు సంబంధించి ఓ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. షారుఖ్ సినిమాకు డూప్ గా నటించే వ్యక్తి గురించి ఆసక్తి చర్చ సాగుతోంది.

సినిమాల్లో నటించే కొందరు హీరోలకు డూప్ లు ఉంటారన్న విషయం చాల మందికి తెలుసు. కానీ వారి వివరాలు బయటకు రావు. గతంలో హీరోలు డ్యూయెల్ రోల్ ఎలా చేశారబ్బా? అని అయోమయానికి గురయ్యేవారు. కానీ సోషల్ మీడియా వచ్చిన తరువాత ప్రతీ విషయం బయటకు వస్తుంది. కొన్ని సందర్భాల్లో హీరోను పోలిన మరో వ్యక్తి అక్కడ నటిస్తాడు. అలా కొందరు స్టార్ హీరోలు తమకు డూప్ గా కొందరు వ్యక్తులను నియమించుకుంటారు. ఈ విధంగా షారుఖ్ కూడా తనకు డూప్ గా ఓ వ్యక్తిని నియమించుకున్నాడు. ఆయన పేరు ప్రశాంత్ వాల్దే.

ప్రశాంత్ వాల్దే కేవలం షారుఖ్ కు డూప్ గా మాత్రమే కాకుండా సినీ ఇండస్ట్రీలో రైటర్ గా, డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ఈయన గత 15 ఏళ్లుగా షారుఖ్ రెండో పాత్రలో నటించారు. తాజాగా వచ్చిన ‘జవాన్’ సినిమాలో షారుఖ్ తండ్రి, కొడుకులుగా నటించిన విషయం తెలిసిందే. షారుఖ్ రెండు పాత్రలు ఒకేసారి కనిపించినప్పుడు ఇందులో ఒకరు ప్రశాంత్ వాల్దే అని అనుకోవాలి. వీరిద్దరు ఓసారి కౌగించుకున్నప్పుడు జాగ్రత్తగా పరిశీలిస్తే అర్థమవుతుంది.

ప్రశాంత్ వాల్దే ఇలా షారుఖ్ కు డూప్ గా నటించినందుకు భారీగానే పారితోషికం తీసుకుంటాడు.ఇతనికి రోజుకు రూ.30 వేలు ఇచ్చారట. అంటే నెలకు రూ.9 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నాడట. తాను జవాన్ లో డూప్ గా నటించినట్లు ప్రశాంత్ వాల్దే ఓ ఇంటర్వ్యూలో ఈ వివరాలను బయటపెట్టాడు. ఇక భవిష్యత్ లో ఈ చాన్స్ ఉంటే కూడా ఆయన నటించే అవకాశాలు ఉంటాయని కొందరు అంటున్నారు.