Bigg Boss 7 Telugu Elimination: బిగ్ బాస్ తెలుగు 7 మొదటి ఎలిమినేషన్ జరిగింది. ఆదివారం ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున నటి కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. ఎలిమినేషన్స్ కి కిరణ్ రాథోడ్ తో పాటు పల్లవి ప్రశాంత్, శోభా శెట్టి, రతికా రోజ్, గౌతమ్ కృష్ణ, ప్రిన్స్ యావర్, దామిని, షకీలా మొత్తం 8 మంది ఉన్నారు. వీరిలో అతి తక్కువ ఓట్లు వచ్చిన కారణంగా కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయ్యింది. కిరణ్ రాథోడ్ ఎలిమినేషన్ అనంతరం ఓ ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది.
బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ప్రతిసారి అమ్మాయిలకే అన్యాయం జరుగుతుంది. మొదటివారమే ఇంటిదారి పట్టిన వాళ్లలో దాదాపు అందరూ అమ్మాయిలే. ఒక్క సీజన్4 మినహాయిస్తే… ఫస్ట్ వీక్ ఇంటిని వీడింది లేడీ కంటెస్టెంట్స్ మాత్రమే. నిజానికి ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ అనేది ఒకింత అవకతవకలతో కూడుకుని ఉంటుంది. కంటెస్టెంట్ ఇంటి వాతావరణానికి అలవాటు పడటానికే కొంత సమయం పడుతుంది. చెప్పాలంటే పూర్తి స్థాయిలో వాళ్ళ పెర్ఫార్మన్స్ బయట పెట్టకుండానే ఇంటి నుండి వెళ్లిపోవడం జరుగుతుంది.
ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయినవారికి అన్యాయం జరిగినట్లే లెక్క. ఇక సీజన్ వన్ నుండి ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ని పరిశీలిస్తే… సీజన్ 1లో నటి జ్యోతి వెళ్ళిపోయింది. బోల్డ్ ఇమేజ్ ఉన్న జ్యోతి హౌస్లో సక్సెస్ అవుతుందని అనుకున్నారు. ఇక సీజన్ 2లో నటి సంజన ఎలిమినేట్ అయ్యింది. సీజన్ 3లో నటి హేమ ఇంటిదారి పట్టింది. హేమ పాప్యులర్ యాక్టర్ కాగా ఆమె మొదటివారమే ఎలిమినేట్ అవుతారని ఊహించలేదు.
సీజన్ 5లో యూట్యూబర్ సరయు ఎలిమినేట్ అయ్యింది. ఆమె ఇటీవల షో అంతా ఫేక్ అని ఆరోపణలు చేయడం విశేషం. ఇక సీజన్ 6లో మొదటివారం ఎలిమినేషన్ లేదు. రెండోవారం ఇద్దరిని ఎలిమినేట్ చేశారు. మేల్ కంటెస్టెంట్ షానితో పాటు అభినయశ్రీ ఎలిమినేట్ అయ్యారు. తాజా సీజన్లో కిరణ్ రాథోడ్. ఇలా ఏడు సీజన్స్లో 6 మంది లేడీ కంటెస్టెంట్స్ ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యారు. ఇదో చెత్త రికార్డు. అలాగే ఇంతవరకు లేడీ కంటెస్టెంట్ టైటిల్ కొట్టలేదు.