Actress Meghna Raj: టాలీవుడ్ కామెడీ హీరోల్లో రాజేంద్రప్రసాద్ తరువాత.. ఆ రేంజ్ లో ఆకట్టుకున్నారు అల్లరి నరేష్. టైమింగ్ కామడీతో ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెంచుకున్న అల్లరి నరేష్ నటించిన సినిమాలు దాదాపు కామెడీనే కలిగి ఉండేవి. ఈ తరుణంలో వచ్చిన కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ ‘బెండు అప్పారావు ఆర్ఎంపీ’. ఈ మూవీలో అల్లరి నరేశ్ తో పాటు కామ్న జెఠ్మలానీ నటించింది. ఇందులో మరో హీరోయిన్ ఉంటుంది. ఆమె పేరు మేఘనా రాజ్. ‘బెండు అప్పారావు ఆర్ఎంపీ’ మూవీతోనే తెరంగేట్రం చేసిన ఈమె ఆ తరువాత మరో తెలుగు సినిమాలో కనిపించి కన్నడ ఇండస్ట్రీకి వెళ్లారు. చాలా రోజుల తరువాత ఆమె ‘తత్సమ తద్భవ’ అనే సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇన్నాళ్లు ఆమె జీవితం విషాదంగా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే?
మేఘనా రాజ్ ‘బెండు అప్పారావు ఆర్ఎంపీ’ సినిమా తరువాత తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో కన్నడ ఇండస్ట్రీకి వెళ్లారు. అక్కడ సినీ నటుడు చిరంజీవిని సర్జాను పెళ్లి చేసుకున్నారు. అయితే దురదృష్టవశాత్తూ చిరంజీవి సర్జా 2020లో గుండెపోటుతో మరణించారు. ఈ సమయంలో మేఘనా గర్భవతి. దీంతో ఆమె తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. అయితే ఆ తరువాత కొడుకుకు జన్మనిచ్చిన తరువాత కోలుకున్నారు. ఇన్నాళ్లకు మళ్లీ సినీ ఎంట్రీ ఇస్తున్నారు.
ఆమె నటించిన ‘తత్సమ తద్భవ’ 15న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమంలో జోరుగా పాల్గొంటున్నారు. క్రైం థిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీలో మేఘనాతో పాటు ప్రజ్వల్, పన్నగా భరణిలు నటించారు. వీరంతా వేర్వేరుగా సినిమా ప్రమోషన్లో పాల్గొంటున్నారు. ‘బెండు అప్పారావు ఆర్ఎంపీ’లో రెండో హీరోయిన్ గా అలరించిన మేఘనా రాజ్ ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. గుర్తుపట్టలేని విధంగా చేంజ్ అయ్యారు. అయినా తన యాక్టింగ్ తో అదరగొట్టారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె సోషల్ మీడియాలోనూ తన ఫొటోలతో సందడి చేస్తున్నారు.