Bigg Boss 7 Telugu Shakeela: అందరి జీవితాలు వారు అనుకున్నట్టు జరగవు. కొన్నిసార్లు జీవితం మనకు పూల దారిస్తే మరికొన్నిసార్లు ముల్ల దారి చూపిస్తుంది. ఇక ఈ రెండు దారుల మధ్య చిక్కుకున్న ఒక నటి జీవితం ఇప్పుడు మనం చూద్దాం.
1990లలో సౌతిండియాని ఓ ఊపు ఊపిన హాట్ లేడీ షకీలా. మలయాళం చిత్ర పరిశ్రమ లో దాదాపు సుదీర్ఘ కాలంపాటు కుర్రకారుని తన మత్తులో కట్టిపడేసిన మీ నటి.. ఒకానొక దశలో తన బీ గ్రేడ్ సినిమాలతోనే టాప్ హీరోయిన్లకి పోటీనిచ్చింది. షకీలా సినిమా రిలీజ్ డేట్ నుంచి రెమ్యునరేషన్ వరకు ఆమెకి సంబంధించిన ప్రతీది ఓ టాక్ ఆఫ్ ది టౌనే.
కానీ అంతటి స్స్టార్ డం చూసిన షకీలా ఆ తర్వాతి కాలంలో తన జీవితంలో ఎవరు ఊహించని కష్టాలు కూడా ఎదుర్కొంది. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు దాటేసిన షకీలా ప్రస్తుతం బిగ్ బాస్ షో తో తిరిగి మన ముందుకు వచ్చింది.
అయితే తను ఈ ప్లాట్ ఫామ్ ఎందుకు ఎంచుకుంది అనేదానికి ముఖ్య కారణం ఉంది. తెరపైన మనం చూసిన తనకు .. నిజజీవితంలో తనకు చాలా తేడా ఉంది. అదే విషయాన్ని 23 ఏళ్ల నుంచి శృంగార తార షకీలా అని ఉండేది. ఇప్పుడు షకీలా అమ్మ అని పిలుస్తున్నారు. నాకు తెలుగు ప్రజలతో ఓ బాండింగ్ కోరుకొంటున్నాను. నాకు మంచి పేరు తెచ్చుకోవాలంటే.. ఈ ఫ్లాట్‌ఫామ్ చాలా అవసరం అని నేను నమ్మాను అని చెప్పింది.
నిజంగా చెప్పాలి అంటే ఏమిటి చాలా మంచి గుణం. బయట ఎన్నో దానాలు చేసి తనకు ఏమీ మిగిల్చుకోకుండా నిలిచింది ఈ నటి. తెర పైన తను చూసిన వారంతా హాట్ బ్యూటీ షకీలా అని అంటే తెరువనుక మాత్రం తనని అమ్మ అనే వారు ఎంతో మంది ఉన్నారు. అందుకే నాగార్జున ఇంటిలోకి మీరు షకీలాగా వెళ్తున్నారా? లేదా షకీ అమ్మగా వెళ్తున్నారా? అని నాగార్జున అంటే.. షకీ అమ్మా అని అనింది అలానే నాగార్జునని షకీ అని పిలువండి అని కోరింది. అయితే షకీ ఇంటిలోకి వెళ్లే ముందు ఆమెను అమితంగా ప్రేమించే వారిని పిలుస్తానని నాగార్జున చెప్పారు. వేదికపైకి షాషా, తంగమ్ అనే ఇద్దరు ట్రాన్స్‌జెండర్స్‌ను పిలిచారు.
ఇక ఈ విషయాన్ని చూసిన వారికి ఈ నటి అసలైన కోణం పూర్తిగా అర్థం కాక తప్పదు.షకీలా బాగోగులను ఈ ఇద్దరు చూసుకొంటారా? అని నాగార్జున అంటే.. లేదు మా బాగోగులే ఆమె చూసుకొంటుంది. మమ్మల్ని కని పెంచినా అంత బాగా చూసుకొనేదో లేదే తెలియదు అని షాషా అనగానే.. షకీలా కంటతడి పెట్టింది. అయితే మీరు కన్నీరు పెట్టకూడదు అంటూ వారిద్దరూ ఓదార్చారు. బిగ్‌బాస్ షోలోకి వస్తున్నారని తెలియగానే మేము చాలా హ్యాపీగా ఫీలయ్యాం. మాటల్లో ఆ ఆనందాన్ని చెప్పలేం అంటూ వారిద్దరూ ఎమోషనల్ అయ్యారు. మీరు బాగా ఆడాలి. టైటిల్ గెలువాలి. చాలా విషయాలు మనసులో పెట్టుకొని షోకు వచ్చారు
ట్రాన్స్ జెండర్స్‌ను బాగా చూసుకోవాలని ఎప్పుడు అనిపించింది అని నాగార్జున అడిగితే.. 25 ఏళ్ల నుంచి నాకు ఇలాంటి ఆలోచన ఉంది. ట్రాన్స్‌జెండర్ చాలా మంది ఫ్యామిలీని వదిలేసి వస్తారు. వీరిద్దరూ నా అమ్మను అమ్మమ్మ అని పిలుస్తారు. తంగమ్ నా పెద్ద కూతురు, షాషా నా చిన్నకూతురు. ఇలాంటి వాళ్లు చాలా మంది ఉన్నారు. దాదాపు 40 మంది ఉన్నారు అని షకీలా ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది.
తంగమ్, షాషాకు పిల్లలు ఉన్నారు. నన్ను అవ్వ అని పిలుస్తారు. విదేశాల నుంచి చాలా మంది వస్తుంటారు. వీళ్లందరూ నన్ను వాళ్ల కమ్యూనిటీలో చేర్చుకొన్నారు. వాళ్ల కమ్యూనిటీలో నాకు చాలా మంది అక్కలు, చెల్లెలు ఉన్నారు అని షకీలా చెప్పింది. అయితే ఆమె నాకు ఎవరూ లేరని బాధపడుతుంటుంది. కానీ ఆమెకు మేము కుటుంబంలా అండగా ఉంటాం అని షకీలా పెంపుడు కూతుళ్లు తెలియజేశారు. ఇక ఈ విషయం వింటేనే మనకు తెలిసిన షకీలా కి అసలు జీవితంలో షకీ అమ్మకి ఎంత తేడా ఉంది అనేది స్పష్టంగా అర్థం అవుతుంది.