Sandeep Reddy Vanga: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో నాచురల్ కథాంశాలతో సినిమాలను తెరకెక్కిస్తారు అని ఎప్పటినుంచో వాళ్లకి ఒక గుడ్ నేమ్ అయితే ఉంది. ఇక వాళ్లతో పోల్చుకుంటే మన తెలుగు సినిమాలు ఎప్పుడు ఫైట్లు, పాటలు మీదనే బేస్ చేసుకుని వస్తాయి అవే సినిమాలు తెలుగు లో హిట్ అవుతూ ఉంటాయి.అసలు తెలుగు వాళ్లకి టేస్ట్ పెద్దగా లేదు అంటూ అప్పట్లో తమిళ్ ఇండస్ట్రీ వాళ్లు మనల్ని కొంచెం చులకనగా చూసేవాళ్ళు అక్కడ స్టార్ డైరెక్టర్లు అయిన వెట్రి మారన్, బాలా సినిమాలు సహజత్వానికి దగ్గర గా ఉంటాయి అనే పేరునైతే సంపాదించుకున్నాయి.
కానీ ఇప్పుడు తెలుగులో కూడా పరిస్థితి మొత్తం మారిపోయింది. సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి సినిమాతో డైరెక్టర్ గా వచ్చి ఇండస్ట్రీ లో ఒక ప్రభంజనాన్ని సృష్టించాడు. ఒక నార్మల్ మనిషి లైఫ్ లో ప్రేమ అనేది ఎంత ఇంపాక్ట్ ను చూపిస్తుంది అనేది మన కళ్ళకు కట్టినట్టుగా చూపించి అర్జున్ రెడ్డిని బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిపాడు. ఇకదానితో ఆయనకి బాలీవుడ్ లో కబీర్ సింగ్ లాంటి సినిమా చేసే అవకాశం అయితే వచ్చింది. ఆ సినిమాతో కూడా సక్సెస్ సాధించడంతో ఇప్పుడు అనిమల్ సినిమా చేసి ఈ సినిమాతో 8 రోజుల్లోనే 600 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టాడు. ఈ కలక్షన్స్ లాంగ్ రన్ లో 1000 కోట్లు దాటుతుందనే అంచనా వేస్తున్నారు. ఇక ఇలాంటి సందర్భంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా తమిళ్, హిందీ, మలయాళం ఇండస్ట్రీల కంటే తక్కువ ఏమీ కాదు అని మరొకసారి సందీప్ రెడ్డి వంగ నిరూపించాడు.
నిజానికి అనిమల్ సినిమా డైరెక్ట్ హిందీ సినిమా అయినప్పటికీ ఆ సినిమాను తీసింది సందీప్ రెడ్డి వంగ కాబట్టి ఆ క్రెడిట్ అంతా తెలుగు వాళ్లకే దక్కుతుంది. ఇక తెలుగులో కూడా రియలేస్టిక్ సినిమాలు తెరకెక్కించే దర్శకుడు ఒకడు ఉన్నాడు వాడే సందీప్ రెడ్డి వంగ అని తెలుగు సినిమా అభిమానులు అందరూ గర్వంగా చెప్పుకుంటున్నారు. తమిళంలో వెట్రీ మారన్ ఉంటే తెలుగులో సందీప్ రెడ్డి వంగ ఉన్నాడు అనేది వాస్తవం…అతనికి ఎలాంటి కథని ఎంచుకోవాలి అందులో హీరోని ఎలా చూపించాలి దాన్ని ఎలా అయితే ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారు అనేది సందీప్ కి బాగా తెలుసు ఆయన చేసిన మూడు సినిమాలకు మూడు సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్లు గా నిలిచాయి.
ఇక మొదటి సినిమా అయిన అర్జున్ రెడ్డి అయితే 30 సంవత్సరాల నుంచి వస్తున్న తెలుగు సినిమా మూస ధోరణి సినిమాలకు స్వస్తి పలుకుతూ ఒక కొత్త సినిమా ఒరవడికి శ్రీకారం చుట్టిందనే చెప్పాలి. దాంతో సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతం తెలుగు సినిమా అభిమానులు అందరూ తమిళ్ ఇండస్ట్రీని ఉద్దేశించి మీకు వెట్రి మారన్ ఉంటే మాకు సందీప్ రెడ్డి వంగ ఉన్నాడు అంటూ గర్వంగా చెబుతున్నారు…