Rohit Sharma: ప్రస్తుతం ఇండియన్ టీం ప్లేయర్లు మంచి ఫామ్ లో ఉన్నారు.ఇక రీసెంట్ గా ఆస్ట్రేలియా మీద జరిగిన టి20 సీరీస్ ని 4-1 తేడాతో గెలవడమే కాకుండా ఇండియన్ టీం లో ఉన్న యంగ్ ప్లేయర్లు అందరు కూడా మంచి ఫామ్ లో ఉన్నారని మరోసారి ప్రూవ్ చేశారు. ఇక సౌతాఫ్రికా తో మరో టి20 సిరీస్ ని ఆడడానికి ఇండియన్ టీం రెఢీ అవుతుంది. ఇవాళ్ళ జరగబోయే మొదటి మ్యాచ్ లో మనమే గెలుస్తాం అని ఇండియన్ ప్లేయర్లందరు ఇప్పటికే మంచి కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు.
ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ 2024 లో టి20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో ఈ టోర్నీ కి ఇండియన్ టీం లోని ఏ ప్లేయర్లు సెలెక్ట్ అవబోతున్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే టీమ్ లో ఉన్న యంగ్ ప్లేయర్లందరు చాలా బాగా ఆడుతున్నారు. అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరు వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు. అందుకే బిసిసిఐ ఇప్పుడు టీం లోకి ఎవరిని తీసుకోవాలి అనే డైలమా లో ఉంది. ఇక ఇలాంటి క్రమంలోనే కెప్టెన్ గా రోహిత్ శర్మ కి బాధ్యతలను అప్పగించాలని చూస్తున్నారు. కానీ ఆయన టి20 వరల్డ్ కప్ ఆడడానికి రెడీగా ఉన్నాడా లేదా అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు.
ఎందుకంటే రీసెంట్ గా తన పర్సనల్ డాక్టర్లను సంప్రదించిన రోహిత్ శర్మ ఇంతకుముందు తగిలిన కొన్ని గాయాలు తిరగబెడుతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. దీంతో ఆల్మోస్ట్ రోహిత్ శర్మ టి20 వరల్డ్ కప్ వరకు ఫిట్నెస్ ని కోల్పోవచ్చు కాబట్టి అప్పటి వరకు ఆయన ఆడకపోవచ్చు అనే వార్తలైతే చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి… మరి ఇలాంటి సమయంలో రోహిత్ శర్మ లాంటి ఒక సీనియర్ కెప్టెన్ ఉండకపోవడం వల్ల టీం కు భారీ నష్టం అయితే జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు ఆ ప్లేస్ లో హార్దిక్ పాండ్య ని కెప్టెన్ గా చేస్తారా లేదంటే ఇప్పటికే ఆస్ట్రేలియాతో జరిగిన టి20 సిరీస్ ని 4-1 తో అందించిన సూర్య కుమార్ యాదవ్ ని కెప్టెన్ గా నియమిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే హార్దిక్ పాండ్య కూడా చీలిమండ గాయంతో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇక జనవరి లో ఆఫ్గనిస్తాన్ తో జరిగే టి20 సిరీస్ కి ఆయన అందుబాటులోకి వస్తారనే సమాచారం అయితే అందుతుంది.
ఇక ఇలాంటి సమయంలో ఆయన టీమ్ లోకి వచ్చి మళ్ళీ రానిస్తాడా లేదా అనే విషయాల మీద స్పష్టత అయితే లేదు. ప్రస్తుతం సూర్య కుమార్ యాదవ్ అయితే అటు ప్లేయర్ గాను, ఇటు కెప్టెన్ గాను చాలా అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు కాబట్టి టి20 ఫార్మాట్ కి తనని కెప్టెన్ గా చేయడం మంచిది అని కొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక బిసిసిఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే మనం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…