Free Bus Travel: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీల్లో ఒకటి మహాలక్ష్మి. ఇందులో రూ.2,500 ఆర్థికసాయం, రూ.500కు సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వంటివి ఉన్నాయి. ప్రభుత్వం కొలువుదీరిని రెండు రోజులకే సీఎం రేవంత్‌రెడ్డి గ్యారంటీ హామీల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ నెరవేర్చారు. శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఈ సదుపాయం కల్పించారు. ప్రభుత్వ నిర్ణయంపై మహిళలల్లో హర్షం వ్యక్తమవుతోంది. తొలిరోజే ఉచిత ప్రయాణానికి విశేష స్పందన వచ్చింది.
సీట్ల కోసం కట్లాట..
ఇదిలా ఉండగా, ఉచిత బస్సు సదుపాయం పుణ్యాన.. నిత్యం ఆటోల్లో వెళ్లే మహిళలు సైతం ఇప్పుడు ఆర్టీసీ వైపు చూస్తున్నారు. పథకం ప్రారంభించిన రెండో రోజు ఆదివారం సెలవు కావడంతో చాలా మంది మహిళలు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికి క్యూకట్టారు. దీంతో బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఈ సందర్భంగా చాలా బస్సుల్లో పురుషులకు సీట్లు దొరకడం లేదు. మరోవైపు మహిళలే సీట్ల కోసం కొట్టుకుంటున్నారు. తాము ముందు వచ్చామంటే.. తాము ముందు వచ్చామని, కాస్త జరగమని, అడ్జెస్ట్ అవుతామని అంటూ ఒత్తిడి చేస్తున్నారు. అడ్జస్ట్ కాని వారితో గొడవ పడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కర్ణాటకలో ఇలాగే..
కర్ణాటక శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ‘శక్తి యోజన’ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఉచిత బస్సు సౌకర్యాన్ని మహిళలు తెగ వాడేస్తున్నారు. ఇదే అవకాశంగా భావించి దేవాలయాలు, పర్యాటక ప్రదేశాలను చూసేందుకు క్యూకడుతున్నారు. దీంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగి సీట్ల కోసం సిగపట్లు, తోపులాటలు, కొట్లాటలకు దిగుతున్నారు. తాజాగా తెలంగాణలోనూ అదే పరిస్థితి నెలకొంది. కార్తీక మాసం కావడం, ఆర్టీసీ ఉచిత ప్రయాణం కల్పించడం ఆదివారం సెలవు కావడంతో మహిళలు గుళ్లూ గోపురాలకు బయల్దేరుతున్నారు. దీంతో బస్సులు మహిళలతోనే కిటకిటలాడుతున్నాయి. కార్తీక సోమవారం సందర్భంగా డిసెంబర్ 11న కూడా ఎక్కువగా రద్దీ ఉండే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు.
రేవంతాల పుణ్యం
మళ్ళీ ఇలాంటి గొడవలు చూస్తున్నాము
మన కెసిఆర్ ఉన్నపుడు గొడవ కే బోర్ కొట్టేది
పటేలా ఎందిది పటెలా#Scamgress pic.twitter.com/bfuEQ8q8ty— Professor (@RanjietJeevan89) December 9, 2023