https://oktelugu.com/

Guntur kaaram OTT : నేడు ఓటీటీలోకి ‘గుంటూరు కారం’.. అందులో ఊహించని సర్ ప్రైజ్ ఇదే

ఈ సినిమాను ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తారా? అని ఎదురుచూస్తుండగా తాజాగా గుడ్ న్యూస్ చేసింది.

Written By:
  • Srinivas
  • , Updated On : February 9, 2024 / 11:59 AM IST

    Guntur Kaaram Review

    Follow us on

    Guntur kaaram OTT : వరుసబెట్టి హిట్లు కొడుతున్న మహేష్ బాబు సినిమాలంటే క్రేజ్ పెరిగింది. మరోవైపు మాస్ సినిమాలను చేస్తున్న సూపర్ స్టార్ ఈమధ్య క్రేజీ స్టార్ గా మారిపోయారు. ఈ తరుణంలో ఆయన మాస్ సినిమా ‘గుంటూరు కారం’తో థియేటర్లోకి వచ్చాడు. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా థియేటర్లోకి వచ్చి సందడి చేసింది. మొదట్లో ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. అయితే ఆ తరువాత వసూళ్లు పెరిగాయి. కానీ 90 శాతం మాత్రమే వసూలయ్యాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీని ఓటీటీలోకి రిలీజ్ చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. దీంతో ఈ సినిమాను ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తారా? అని ఎదురుచూస్తుండగా తాజాగా గుడ్ న్యూస్ చేసింది.

    మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన గుంటూరు కారం విడుదలకు ముందే సంచలన ప్రచారం పొందింది. మహేష్ బాబు లుక్స్, శ్రీలీల డ్యాన్స్ కు ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో సినిమా కోసం ఎదరుచూస్తుండగా జనవరి 12న రిలీజ్ చేశారు. సినిమా రిలీజ్ అయ్యాక కొన్ని వర్గాల వారు త్రివిక్రమ్ పాత సినిమాల్లాగే చిత్రీకరించారన్న టాక్ వచ్చింది. కానీ సినిమాలోని సాంగ్స్, ఫైల్స్, మహేష్ యాక్షన్ తో ముందుకు సాగింది.

    ఈ తరుణంలో సినిమాను ఓటీటీలోకి రిలీజ్ చేస్తామని ఎప్పుడో అనౌన్స్ చేశారు. కానీ తీదీలు మాత్రం ప్రకటించలేదు. మొత్తానికి ఫిబ్రవరి 9న అర్ధరాత్రి ఓటీటీ లోకి రానుంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాను సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా చూడాలంటే నెట్ ప్లిక్స్ లో వీక్షించవచ్చు. హారిక క్రియేషన్స్ పై త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా సాగుతుంది. ఇందులో రమ్యకృష్ణ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. కాగా ఓటీటీలో ప్రసారం అయ్యే సినిమాలో మదర్ సెంటిమెంట్ సాంగ్ ను యాడ్ చేయనున్నారు. అలాగే ఇందులో కబడ్డీ ఫైట్ కూడా ఉంటుందని సినిమా బృందం తెలిపింది. మహేష్ అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చిత్రబృందం తెలిపింది.