Samantha Majili Movie: ఇది కదా హీరోయిన్ ఎంట్రీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంటే: థమన్, సమంత కలలో కూడా ఊహించి ఉండరు

నాగచైతన్య తో కలిసి ఉన్నప్పుడు సమంత అతనికి జోడిగా మజిలీ అనే సినిమాలో నటించింది.. అందులో తన భర్తను అమితంగా ప్రేమించే భార్యగా నటించింది. నటించింది అనేకంటే జీవించింది అనడం సబబు. ముఖ్యంగా అతడు బాగుపడాలని ఆమె చేసే త్యాగం మామూలుగా ఉండదు. ప్రతి ఒక్కళ్ళతోనూ కన్నీరు పెట్టిస్తుంది.

Written By: Bhaskar, Updated On : April 28, 2023 2:32 pm
Follow us on

Samantha Majili Movie: విజయశాంతి, అనుష్క.. వీరిద్దరు కూడా మెయిల్ డామినేషన్ అధికంగా ఉండే సినిమా ఇండస్ట్రీలో.. హీరో లెవెల్ లో గౌరవం అందుకున్న వారు. తమ సెంట్రిక్ గా కథలు నడిచేలా.. జనాల్ని మెప్పించినవారు. అందుకే కదా ఇప్పటికీ కర్తవ్యం, ఒసేయ్ రాములమ్మ, అరుంధతి, భాగమతి లాంటి సినిమాలు వస్తే జనాలు కళ్ళు ఆర్పకుండా చూసేది. వీళ్ళ హవా కొనసాగినప్పుడు ఇండస్ట్రీలో దర్శకులు ప్రత్యేకంగా వీరిని దృష్టిలో పెట్టుకునే కథలు రాసేవారు. వాటిల్లో కొన్ని విఫలమైనప్పటికీ.. మెజార్టీ సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. అయితే ఇప్పటి జనరేషన్లో వీరికి తగ్గట్టుగా మిగతా హీరోయిన్లకు సినిమాలు పడలేదు. ఇందులో సమంతను కొంత మినహాయించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈమె నటించిన కొన్ని సినిమాల్లో హీరోలు ఉన్నప్పటికీ ఈమె రోల్ పూర్తి డామినేషన్ గా ఉండేది.

అదిరింది

నాగచైతన్య తో కలిసి ఉన్నప్పుడు సమంత అతనికి జోడిగా మజిలీ అనే సినిమాలో నటించింది.. అందులో తన భర్తను అమితంగా ప్రేమించే భార్యగా నటించింది. నటించింది అనేకంటే జీవించింది అనడం సబబు. ముఖ్యంగా అతడు బాగుపడాలని ఆమె చేసే త్యాగం మామూలుగా ఉండదు. ప్రతి ఒక్కళ్ళతోనూ కన్నీరు పెట్టిస్తుంది. ముఖ్యంగా సమంత ఇంటర్వెల్ సీన్ ఈ సినిమాకు హైలెట్.. వర్షం పడుతుండగా ఒక ఆటో ఆగుతుంది. అందులో నుంచి ఒక మహిళ కాలు.. ఆమె రెండవ వేలికి ఉన్న మెట్టెలు కనిపిస్తాయి. అలా క్లోజప్ షాట్ లో గొడుగు తీస్తూ సమంత బయటకు వస్తుంది. ఆ సన్నివేశానికి ఎస్ఎస్ థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. థమన్ పెద్ద పెద్ద హీరోలకు సినిమాలు చేయవచ్చు. కానీ ఈ సినిమా బిజిఎం మాత్రం అతడికి పూర్తిస్థాయిలో సంతృప్తి ఇస్తుంది.

అర్థం అయ్యేలా చెప్పాడు

ఈ సన్నివేశంలో ముందు ఒక పెళ్లికి సంబంధించి ఒక సన్నాయి మోగుతుంది. తర్వాత దానిని అనుసరిస్తూ ఒక గజల్ వినిపిస్తుంది. ఈ రెండిటి మధ్య సాయోధ్య లేదు అనే దానికి సంకేతంగా కీ బోర్డు వాయిద్యం శబ్దం వినిపిస్తుంది. అంటే ఈ సినిమాలో నాగచైతన్యకు, సమంతకు మధ్య గ్యాప్ ఉందని ఈ బీజీయం ద్వారా థమన్ మనకు చెప్పే ప్రయత్నం చేశాడు. ఎంతో జాగ్రత్తగా చూస్తే తప్ప ఇది మనకు అర్థం కాదు. ఇక ఈ సినిమా తర్వాత సమంతకు ఇంత మంచి పాత్ర లభించలేదు. ముందుగానే చెప్పినట్టు ఈ సినిమాలో ఆమె జీవించేసింది. ఈ సినిమాలో పాటలు కూడా అద్భుతంగా ఉంటాయి.. అన్నట్టు ఈ సినిమా తర్వాత సామ్, చైతన్య మరే సినిమాలో నటించలేదు. ఈ సినిమాలో వారిద్దరి మధ్య గ్యాప్ ఉంటుంది.. పాపం నిజ జీవితంలోనూ ఇదే పరిస్థితి రావడం నిజంగా ఆశ్చర్యకరం.