https://oktelugu.com/

Kanna Lakshminarayana : కన్నా’కు కుర్చీ కూడా వేయని చంద్రబాబు.. పరువు పాయే

టీడీపీలో చేరారో లేదో ఆయనకు అక్కడ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా రాయపాటి సాంబశివరావు రూపంలో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : April 28, 2023 / 02:32 PM IST
    Follow us on

    Kanna Lakshminarayana : ఏ నాయకుడు అయినా గౌరవమున్న పార్టీలో చేరుతాడు. సముచిత స్థానం దక్కితేనే ఒక పార్టీ నుంచి మరో పార్టీలో చేరుతాడు. ఇలా చేరే క్రమంలో పూర్వ పార్టీపై రకరకాల ఆరోపణలు చేస్తాడు. రాజకీయాల్లో ఇదో సర్వసాధారణం అయిపోయింది. అయితే కొందరు నేతలు పార్టీ మారే సమయంలో సిల్లీ రీజన్స్ చెబుతుంటారు. ఆ రీజన్స్ రివర్స్ అయ్యేసరికి వారి ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. అటువంటి సిట్యువేషన్ ను ఏరికోరి తెచ్చుకున్నారు సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఆయనకు ఒక హోదా గుర్తింపు ఉండేది. అధ్యక్ష పదవి నుంచి తొలగించినా బీజేపీ హైకమాండ్ మంచి గుర్తింపునిస్తూ వచ్చింది. కానీ ఆయన బీజేపీని వీడి టీడీపీలో చేరిపోయారు. బీజేపీలో గౌరవం దక్కడం లేదని.. టీటీడీపీలో పుష్కలంగా గౌరవం దొరుకుతుందని చెప్పుకొచ్చారు. అయితే ఆయన ఇప్పుడు టీడీపీలో గుంపులో గోవిందయ్యగా మారిపోయారు.

    బీజేపీలో గౌరవం..
    రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ ను వీడి వైసీపీలో చేరుదామనుకుంటున్న ఆయన సెడన్ గా యూటర్న్ తీసుకున్నారు. అనూహ్యంగా బీజేపీలో చేరారు. ఇలా చేరిందే తడువు బీజేపీ రాష్ట్ర పగ్గాలు అందుకున్నారు. కేంద్ర, రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉండడంతో పదవిని బాగానే ఎంజాయ్ చేశారు. గత ఎన్నికల్లో బీజేపీ ఓటమికి బాధ్యత వహిస్తూ హైకమాండ్ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించింది. అతడికి పార్టీలో ప్రత్యర్థి అయిన సోము వీర్రాజుకు అప్పగించేసరికి కన్నా కీనుక వహించారు. అప్పటి నుంచి పట్టరాని కోపంతో ఉన్న ఆయన సోమును తప్పించి మరోసారి అధ్యక్షపీఠం దక్కించుకోవాలని శతవిధాలా ప్రయత్నించారు. కానీ కుదరలేదు. దీంతో ప్రత్యామ్నాయం లేకపోవడంతో టీడీపీలో చేరారు.

    కేడర్ మల్లగుల్లాలు..
    అయితే టీడీపీలో చేరారో లేదో ఆయనకు అక్కడ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా రాయపాటి సాంబశివరావు రూపంలో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. స్వేచ్ఛగా గుంటూరు జిల్లాలో తిరగలేకపోతున్నారు. గౌరవం ఉన్నచోట లేదని చెప్పారని.. ఇప్పుడు టీడీపీలో అదే లేకుండా పోయిందని కన్నా అనుచరులు తెగ బాధపడిపోతున్నారు. ఇప్పుడు వారికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. పల్నాడులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నించారు. కన్నా చంద్రబాబు వెంటే ఉన్నారు. కానీ పూర్వం బీజేపీ మాదిరిగా దక్కిన గౌరవం మాత్రం లభించడం లేదు. చంద్రబాబు కుర్చీలో కూర్చొంటే .. కన్నా పక్కనే గుంపులో గోవిందంలా నిలబడాల్సి వచ్చింది.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ఫొటోలే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఇంత బతుకు బతికి ఇదేంది కన్నా అంటూ నెటిజెన్లు సెటైర్లు వేస్తున్నారు. ఏరికోరి కష్టాలు తెచ్చుకోవడమంటే ఇదే మరీ.