Ram Charan: రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ స్టార్ హీరో.. ఒకప్పుడు చాలా కష్టాలు పడ్డారు. అసలు రామ్ చరణ్ సినిమాలకే పనికిరాడు అంటూ చాలా మంది హేళన చేశారట. కానీ అన్నింటిని ఎదుర్కొని ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా ఎదిగారు రామ్ చరణ్. సుదీర్ఘ కాలంగా తనదైన స్టైల్ లో సినిమాలను చేస్తూ మార్కెట్ ను, ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా మారి భారీ ప్రాజెక్ట్ లను చేస్తున్నారు. ప్రస్తుతం తన చేతిలో రెండు పాన్ ఇండియా చిత్రాలను చేస్తున్నారు.
ఇవే కాదు మరో చారిత్రక సినిమాను చేయబోతున్నారట రామ్ చరణ్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. దిగ్గజ దర్శకుడు ఎస్ శంకర్ తో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమా షూటింగ్ సగం కంటే ఎక్కువే పూర్తైంది. దీన్ని ఈ ఏడాది చివర్లోనే విడుదల చేసే అవకాశం ఉందని టాక్.
రామ్ చరణ్ తన 16వ సినిమాను ఉప్పెన ఫేం బుచ్చిబాబు సనితో చేయబోతున్నారట. ఈ సినిమా స్ట్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో రాబోతుందని ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి. ఇందులో హీరో కబడ్డీ ప్లేయర్ గా నటించబోతున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. గేమ్ చేంజర్ ను పూర్తి చేసిన వెంటనే దీన్ని మొదలుపెట్టబోతున్నారట.
గ్లోబల్ స్టార్ అయిన తర్వాత రెట్టించిన జోష్ తో కనిపిస్తున్న రామ్ చరణ్.. ఇప్పుడు చేస్తున్న సినిమాల తర్వాత మరికొన్ని సినిమాలు కూడా చేసేందుకు రెడీ అవుతున్నారట. ఇందులో భాగంగానే లోకేష్ కనకరాజ్, ప్రశాంత్ నీల్, సుకుమార్ లాంటి బడా డైరెక్టర్లతో చర్చలు జరిపారట. అంతేకాదు వీటిలో కొన్ని కాంబినేషన్ లు కూడా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.