India Today C Voter Survey: ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పటినుంచి మరో లెక్క. ఇలా అంటుంది ఎవరో తెలుసా? టిడిపి శ్రేణులు. ఎందుకో తెలుసా? సర్వేలు ఇప్పుడిప్పుడే అనుకూలంగా రావడంతో పొంగి పోతున్నారు. గ్యారెంటీగా అధికారాన్ని చేజిక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీలు అన్నాక, ఎన్నికలు అన్నాక.. అన్ని పార్టీలకు గెలుపు పై ధీమా ఉండడం సహజం. కానీ సర్వేలను పరిగణలోకి తీసుకొని గెలుపు పై ధీమాకు రావడం కాస్త అతిగానే ఉంటుంది. ఇప్పుడు తాజాగా ఇండియా టుడే- సి ఓటర్ సర్వే చూసి టిడిపి జబ్బలు చరుచుకుంటోంది. కానీ ఇదే సర్వే 2019 ఎన్నికల్లో సైతం బోల్తాపడిన విషయాన్ని మరిచిపోతోంది.
ఇప్పటివరకు ఏపీలో వచ్చిన సర్వేలన్నీ వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. పోనీ అధికార పార్టీ కాబట్టి, రకరకాలుగా ప్రలోభ పెట్టి అనుకూలంగా సర్వేలు చేయించుకుంటుందని అనుకోవచ్చు కానీ… పదుల సంఖ్యలో సర్వేలు వైసీపీకి అనుకూల ఫలితాలు ఇచ్చిన విషయాన్ని మరిచిపోకూడదు. ఇండియన్ టీవీ- సీఎన్ఎక్స్, టైమ్స్ నౌ – ఈటిజి, లోక్ పోల్, పొలిటికల్ క్రిటిక్, జన్మత్ పోల్స్, డెక్కన్ 24 * 7, టైమ్స్ నౌ- నవభారత్, ఎలక్షేన్స్, ఫస్ట్ స్టెప్ సొల్యూషన్, ఇండియా ఎనలైటికా, పోల్ స్ట్రాటజీ గ్రూప్,పార్థదాస్, టైమ్స్ నౌ- మాట్రైజ్ తదితర సర్వేలన్నీ వైసిపి గెలుస్తుందని స్పష్టం చేశాయి. ఇప్పుడు వాటికి భిన్నంగా ఇండియా టుడే- సి ఓటర్ సర్వే టిడిపికి అనుకూలంగా ఫలితాలు ఇవ్వడం విశేషం.
2019 ఎన్నికలకు ముందు ఇదే సి ఓటర్ సంస్థ ఏపీలో మరోసారి టీడీపీ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేసింది. అప్పట్లో మిగతా సర్వే సంస్థలన్నింటికీ భిన్నంగా ఫలితాలను వెల్లడించింది. ఇప్పుడు మరోసారి సర్వే వివరాలను వెల్లడించింది. తెలుగుదేశం, జనసేన కూటమి 17 పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంటుందని స్పష్టం చేసింది. వైసిపి ఎనిమిది స్థానాలకు పరిమితమవుతుందని తేల్చింది. ఇప్పుడు ఇవే సర్వే ఫలితాలతో తెలుగుదేశం పార్టీ సంబరాలు చేసుకుంటోంది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. అయితే నెటిజెన్లు భిన్నంగా కామెంట్లు పెడుతున్నారు. 2019లో ఇదే సర్వే సంస్థ ఇచ్చిన ఫలితాలను గుర్తు చేస్తున్నారు. ప్రజలు మీకంటే తెలివైన వాళ్లు చంద్రబాబు.. ఫేక్ సర్వేలతో ప్రజల్లో మార్పు తేలేరు అంటూ వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. కానీ టిడిపి శ్రేణులు మాత్రం ఈ సర్వే విశ్వసనీయతకు దగ్గరగా ఉందని.
.. మీలా 25కి 25 ఎంపీ సీట్లు దక్కుతాయని చెప్పించలేదని.. భ్రమలు కల్పించలేదని టిడిపి అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.