Rajkumar Kasireddy: సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది నటులు వాళ్ళకంటూ ఒక మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తూ ఉంటారు.అందుకే వాళ్ళు నటించిన ప్రతి సినిమాలో కూడా వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండే విధం గా చూసుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది డైరెక్టర్లు చేసిన కొన్ని సెపరేట్ క్యారెక్టర్ ల వల్ల ఇండస్ట్రీ లో వాళ్ళకి కూడా మంచి పేరు వస్తుంది.అలా ఇండస్ట్రీ లో మంచి పేర్లు తెచ్చుకున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఇక ఇండస్ట్రీ లోనటుడి గా ఎదుగాలనే ఉదేశ్యం తో చాలా మంది కొత్త నటులు ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇస్తున్నారు.
నిజానికి ఒకప్పుడు కమెడియన్లు గా మంచి పేరు తెచ్చుకున్న బ్రహ్మనందం లాంటి నటుడికి అరగుండు అనే క్యారెక్టర్ పెట్టి దాన్ని ఎలా నటిస్తే అది స్క్రీన్ మీద అద్భుతంగా పండుతుంది అనేది కూడా నటించి చూపించిన డైరెక్టర్ జంధ్యాల… బ్రహ్మనందంతో ఆ క్యారెక్టర్ చేయించడం వల్ల తను ఇండస్ట్రీ లో టాప్ కమెడియన్ గా చాలా సంవత్సరాల పాటు వెలిగిపోయాడు…ఇక ఈ జనరేషన్ లో కూడా చాలా మంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని ముందుకు దూసుకెళ్తున్నారు.
అందులో విశ్వక్ సేన్ హీరో గా వచ్చిన అశోకవనం లో అర్జున కళ్యాణం సినిమా లో ఫోటో గ్రాఫర్ గా నటించి అద్భుతమైన నటన తో మెప్పించిన నటుడు రాజ్ కుమార్ కసిరెడ్డి కూడా సినిమాల్లో కమెడియన్ గా నటిస్తూ మంచి పేరు అయితే సంపాదించుకుంటున్నాడు.ఇక ఈ సినిమాలో విశ్వక్ సేన్ కూడా చాలా డిఫరెంట్ లుక్ తో నార్మల్ గా కనిపిస్తాడు.ఇంతకు ముందు సినిమాలు అయినా ఫలక్ నుమా దాస్ సినిమా లో చాలా మాస్ గా అగ్రెసివ్ గా కనిపించిన విశ్వక్ సేన్ ఈ సినిమాలో కూల్ గా, ఒక డిఫరెంట్ రోల్ లో నటించి మెప్పించాడు. ఇక రాజ్ కుమార్ 2019 లో వచ్చిన రాజావారు రాణి గారు సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా మంచి విజయం సాధించడం తో ఆయన కూడా వరుసగా సినిమాలు చేస్తూ మంచి బిజీ గా ఉంటున్నాడు.
ఈయన వరుసగా రంగ రంగ వైభవం గా,స్టాండప్ రాహుల్,అర్జున ఫాల్గుణ,సీత రామం,రంగ బలి లాంటి సినిమాల్లో నటించి నటుడు గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఇక 2023 సైమా అవార్డ్స్ కి గాను ఈయన ఉత్తమ కామెడీ నటుడు గా నామినేట్ అయ్యారు.అయితే ఈయన రీసెంట్ గా వచ్చిన బెందురులంక 2012 సినిమాలో బీభత్సమైన కామెడీ ని పండించి ఆ సినిమా విజయం లో కీలక పాత్ర వహించాడు.ఈ సినిమా మొత్తానికి తనే మెయిన్ పిల్లర్ గా నిలిచాడు…ఇక ఫ్యూచర్ లో ఈయన ఇంకా చాలా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ లో టాప్ పొజిషన్ కి వెళ్లే అవకాశం ఉంది…