Pranav Mohanlal: మోహన్ లాల్ సతీమణి పేరు సుచిత్ర. ఈ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడి పేరు ప్రణవ్.. అతడు 2002లో బాల నటుడిగా మాలయాల చిత్ర పరిశ్రమంలోకి ఎంట్రీ ఇచ్చాడు. 2018లో హృదయం అనే పేరుతో ఓ చిత్రంలో హీరోగా నటించాడు. అది ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత ప్రణవ్ ఇంతవరకు మరో చిత్రాన్ని చేయలేదు. అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో ప్రకారం అతడు స్పెయిన్ లో ఉంటున్నట్టు తెలుస్తోంది. దీనిపై ప్రాణవ తల్లి సుచిత్ర ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ” నా కుమారుడు ప్రణవ్ ప్రస్తుతం స్పెయిన్ లో ఉన్నారు. అక్కడ ఒక వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్నారు. తన వసతి కోసం, ఆహారం కోసం ఆ పని చేస్తున్నారు. మీడియాకు నా కుమారుడు దూరంగా ఉంటాడు. ప్రయాణాలు చేయడం అతనికి ఎక్కువగా ఇష్టం. పుస్తకాలను విపరీతంగా చదువుతుంటాడు. ఇతరులపై అతడు ఎక్కువగా ఆధారపడడు. ఇలా వద్దని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ అతడు వినిపించుకోలేదు. తన అభిరుచికి అడ్డు రాకూడదని మాకే ఎదుటి సమాధానం చెప్పాడు. దీంతో మేము అతడు ఇష్టానికి వదిలేసాం. ప్రస్తుతం అతడు స్పెయిన్ లోని ఓ వ్యవసాయ క్షేత్రంలో వర్క్ అవే కార్యక్రమంలో పాల్గొంటున్నాడు. ఆర్థిక ప్రతిఫలాని కంటే ప్రణవ్ అనుభవాలకు ఎక్కువ విలువ ఇస్తాడు. ఆ వ్యవసాయ క్షేత్రంలో గుర్రాలు, ఏకల సంరక్షణలో అతడు పాల్గొంటున్నాడు. ప్రణవ్ నా మాట వింటాడని మా బంధువులు అనుకుంటారు. కానీ అది నిజం కాదు. అతడికి సొంత ఆలోచనలు ఉంటాయి.. అలాగని మొండివాడు కాదు. తాను నమ్మిన దానికోసం ఎంత దూరమైనా వెళ్తాడని” సుచిత్ర పేర్కొన్నారు.
బాల నటుడిగా
ప్రణవ్ 2002లో మలయాళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించాడు. బాల నటుడిగా “ఒన్నమన్” అనే సినిమాలో నటించాడు. 2003లో “పునర్జని” అనే సినిమాలో నటించి బాల నటుడిగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డును అందుకున్నాడు. 2018లో హృదయం అనే సినిమాలో హీరోగా నటించాడు..ఆ సినిమా ఆ ఏడాది మలయాళ చిత్ర పరిశ్రమలో ఎక్కువ వసూలు సాధించిన చిత్రంగా నిలిచింది. సినిమాలో హీరోగా నటించినప్పటికీ.. అతడు తన అభిరుచిని పక్కకు పెట్టలేదు. విహారిగా ప్రపంచం మొత్తం తిరుగుతూనే ఉన్నాడు. కొత్త కొత్త అనుభవాలను నేర్చుకుంటూనే ఉన్నాడు.. ఈ కాలపు యువకుడైనప్పటికీ సెల్ఫోన్ కు దూరంగా పుస్తకాలకు దగ్గరగా బతుకుతున్నాడు. బహుశా స్టార్ డం అనేది అతడి ఒంటికి పడదనుకుంటా. ఒక్క సినిమా హిట్ కాగానే ఎంతో హిప్పోక్రసి కొనసాగించే నటులు ఉన్న ఈ కాలంలో.. ప్రణవ్ లాంటి యువ నటుడు కూడా ఉండడం నిజంగా ఆశ్చర్యకరమే.