https://oktelugu.com/

Kavya Thapar: ఆ డైరెక్టర్ నన్ను కోరుకున్నాడు.. కావ్యా థాపర్ సంచలన వ్యాఖ్యలు.. ఇంతకీ ఎవరా డైరెక్టర్..?

టాలీవుడ్ చిత్ర పరిశ్రమ గురించి కావ్యా థాపర్ సంచలన విషయాలు వివరించింది. ఒక దర్శకుడు తనను కమిట్ మెంట్ అడిగాడని కానీ అప్పుడే ఏం జరిగిందంటే...

Written By: Mahi, Updated On : November 15, 2024 1:25 pm
Kavya Thapar

Kavya Thapar

Follow us on

Kavya Thapar Interview: టాలీవుడ్ లో రీసెంట్ గా మంచి గ్లామర్ తో గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ కావ్యా థాపర్. మోడలింగ్ ద్వారా కెరీర్ మొదలు పెట్టిన కావ్యా మెల్ల మెల్లగా హీరోయిన్ గా అవకాశాలను సంపాదించుకుంది. ‘ఈ మాయ పేరేమిటో’తో వెండితెరపై అడుగుపెట్టింది. ఈ మూవీ ఆశించిన స్థాయిలోనే ఆడింది కానీ కావ్యకు మాత్రం పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత ఏక్ మినీ కథతో అనే సినిమాతో హిట్ అందుకుంది. తర్వాత ‘ఈగల్’, ‘ఊరు పేరు భైరవకోన’ చిత్రాల్లో గ్లామర్ తో కట్టిపడేసింది. రీసెంట్ గా పూరీ-రామ్ పోతినేని కాంబోలో తెరకెక్కించిన ‘డబుల్ ఇస్మార్ట్’ లో ఓ రేంజ్ లో అందాలను ఆరబోసి యూత్ ను మెస్మరైజ్ చేసింది. గోపీచంద్ తో కలిసి ‘విశ్వం’లో కూడా డీసెంట్ యాక్టింగ్ చేసి అలరించింది. ఇప్పటి వరకు ఈ హీరోయిన్ సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోయినా టాలీవుడ్ లో వరుస అవకాశాలను దక్కించుకొని బిజీగా సాగుతోంది. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. తన కెరీర్ స్టార్టింగ్ డేస్ లో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంది. మొదట్లో ఇండస్ట్రీ అంటే ఇంతేనేమో అనుకుందట, రాను రాను తెలిసి వచ్చిందట. మనం దేనికి ఇక్కడికి వస్తాం.. ఇక్కడున్న వారు మన నుంచి ఏది కోరుకుంటారో తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది అంటుంది. ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూలో ఇండస్ట్రీ గురించి, ఇండస్ట్రీలోని ఒక డైరెక్టర్ (పేరు చెప్పడం లేదు) గురించి చెప్పుకచ్చింది. మొదట్లో చాలా బాధపడ్డానని ఆ తర్వాత అడ్డుకున్నాడనని, చెప్పుకచ్చింది.

ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘కెరీర్ స్ట్రార్టింగ్ లో ఒక యాడ్ కోసం ఆర్టిస్టులు కావాలన్నారు. తెలిసిన వారి నుంచి సమాచారం రావడంతో ట్రై చేస్తే బాగుంటుందనుకున్నాను. నాకు ఇచ్చిన ఫోన్ నెంబర్ కు ఫోన్ చేశాను. ఆడిషన్ ఇచ్చేందుకు ఫలానా వద్ద ఉన్న ఆఫీస్ రావాలని యాడ్ మేకర్ (దర్శకుడు) చెప్పాడు అక్కడికి వెళ్లాను. ఆ యాడ్ గురించి మాట్లాడిన అతను తర్వాత నాలుగు యాడ్స్ లలో కూడా అవకాశం ఇస్తాను అన్నాడు. అతను ఏదో డిఫరెంట్ గా మాట్లాడుతున్నట్లు అనిపించింది. ఆ తర్వాతనే చెప్పాడు. దీంతో పాటు నాలుగింటిలో అవకాశం కల్పిస్తా ఫార్మాలిటీకి నిన్ను సెలక్ట్ చేయాలని కమిట్మెంట్ ఇస్తే సెలక్ట్ చేస్తా అన్నాడు.’

‘ఆ మాటలు వినడంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యా. పట్టలేనంత కోపం వచ్చింది. అలాంటివి ఇష్టం ఉండవని ముఖం మీద చెప్పేసి వచ్చేశా..’ అని చెప్పింది. ఇప్పుడు కావ్యా థాపర్ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొదట యాడ్స్ ద్వారా కెరీర్ మొదలు పెట్టిన ఈ హీరోయిన్.. కేవలం గ్లామర్ తోనే తెలుగు, తమిళ భాషల్లో అవకాశాలు దక్కించుకుంటుంది.