https://oktelugu.com/

Harihara Veeramallu Movie: పవన్ కళ్యాణ్ సినిమా నుంచి జాక్వెలిన్ ఔట్… ఆమె స్థానంలో ఎవరంటే

Harihara Veeramallu Movie: పవర్ స్టార్‌ పవన్‌ కళ్యాణ్  హీరోగా నటిస్తున్న సినిమా ‘హరి హర వీర మల్లు’. ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్‌ క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలోని ఓ పాత్రకు మొదటగా శ్రీలంక ముద్దుగుమ్మ, బాలీవుడ్‌ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ను ఎంపిక చేశారు. ఇటీవల ఓ కేసులో జాక్వెలిన్‌కు ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో జాక్వలెన్ సమస్యల్లో చిక్కుకుంది. దేశం విడిచి వెళ్లకుండా కూడా ఈడీ ఆదేశాలు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 16, 2021 / 05:42 PM IST
    Follow us on

    Harihara Veeramallu Movie: పవర్ స్టార్‌ పవన్‌ కళ్యాణ్  హీరోగా నటిస్తున్న సినిమా ‘హరి హర వీర మల్లు’. ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్‌ క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలోని ఓ పాత్రకు మొదటగా శ్రీలంక ముద్దుగుమ్మ, బాలీవుడ్‌ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ను ఎంపిక చేశారు. ఇటీవల ఓ కేసులో జాక్వెలిన్‌కు ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో జాక్వలెన్ సమస్యల్లో చిక్కుకుంది. దేశం విడిచి వెళ్లకుండా కూడా ఈడీ ఆదేశాలు ఇచ్చింది. అయితే అందుకే జాక్వెలిన్‌ను పవన్‌ సినిమా నుంచి తొలగించినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. వీటిపై దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తాజాగా స్పందించారు.

    Harihara Veeramallu Movie

    Also Read: సావిడిలో జంధ్యాల… స్నానం చేసి రా పో !

    సదరు వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. “డేట్స్ ఇష్యూ వలన జాక్వలిన్ ఫెర్నాండేజ్ మా సినిమా చేయలేకపోయింది. డేట్స్ అడ్జస్ట్ చేయడం ఆమెకు కష్టం అయ్యింది. అందుకే, గత ఏడాది సినిమా నుంచి తప్పుకొంది. ఆమె స్థానంలో మేం నర్గిస్ ఫక్రిని ఎంపిక చేశాం. జాక్వలిన్ ఇప్పుడు వార్తల్లోకి వచ్చేసరికి అనవసరంగా మా సినిమా ప్రస్తావన తీసుకొస్తున్నారు” అని క్రిష్ జాగర్లమూడి పేర్కొన్నారు. ‘హరి హర వీర మల్లు’ సినిమాలో మొఘల్ సామ్రాజ్యానికి చెందిన రోషనార పాత్రలో నర్గిస్ ఫక్రి కనిపించనున్నారు. మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో 17వ శతాబ్దపు కథతో ఈ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పవన్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. ఏయం రత్నం భారీ బడ్జెట్ తో ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

    Also Read: చిత్ర పరిశ్రమకు కొత్త రూల్స్ ప్రకటించిన కార్మిక శాఖ…