https://oktelugu.com/

Hombale Films: ఆ సినిమా ప్లాప్ తో మొదలు..‘కేజీఎఫ్’, ‘కాంతారా’తో గుర్తింపు..ఇదీ ..‘హోంబలే’ జర్నీ

Hombale Films: ‘కేజీఎఫ్’, ‘కాంతార’ సినిమాలు దేశ సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. కేజీఎఫ్ సినిమాను చూసి హీరో యాక్షన్.. వైవిధ్యమైన కథను అందించిన డైరెక్టర్ ను మెచ్చుకున్నారు.. ఇప్పుడు ‘కాంతార’ తో డైరెక్టర్ కం హీరో రిషబ్ శెట్టి పేరు మారుమోగుతోంది. కానీ ఈ రెండు సినిమాలు తెరపైకి రావడానికి ‘హోంబలే’ కృషి ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. ఈ సినిమాలు సక్సెస్ కావడానికి తెరపై నటుల కృషి ఎంత ఉందో.. ఇవి ఇక్కడిదాకా […]

Written By:
  • SHAIK SADIQ
  • , Updated On : November 11, 2022 9:32 am
    Follow us on

    Hombale Films: ‘కేజీఎఫ్’, ‘కాంతార’ సినిమాలు దేశ సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. కేజీఎఫ్ సినిమాను చూసి హీరో యాక్షన్.. వైవిధ్యమైన కథను అందించిన డైరెక్టర్ ను మెచ్చుకున్నారు.. ఇప్పుడు ‘కాంతార’ తో డైరెక్టర్ కం హీరో రిషబ్ శెట్టి పేరు మారుమోగుతోంది. కానీ ఈ రెండు సినిమాలు తెరపైకి రావడానికి ‘హోంబలే’ కృషి ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. ఈ సినిమాలు సక్సెస్ కావడానికి తెరపై నటుల కృషి ఎంత ఉందో.. ఇవి ఇక్కడిదాకా రావడానికి తెరవెనుక ‘హోంబలే’ ప్రయత్నం అంతకంటే ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. అసలు హోంబలే’ హిస్టరీ ఎంటీ..? దీని వెనుక ఉన్నదెవరు..?

    Hombale Films

    ఒక సినిమా థియేటర్లోకి రావాలంటే హీరో, డైరెక్టర్ కృషి చాలా ఉంటుంది.కానీ ఆ సినిమా బాధ్యత అంతా నిర్మాత చేతిలో ఉంటుంది. లాభం వస్తే పర్వాలేదు.. కానీ నష్టం వచ్చినా తట్టుకునే శక్తి కొందరు నిర్మాతలకే ఉంటుంది. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రేక్షకులకు మంచి కథలను అందించాలని కొందరు నిర్మాతలు కొత్త డైరెక్టర్లు, హీరోలను ప్రోత్సహిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఆడియన్స్ సైతం అమితమైన వినోదాన్ని పొంది సినిమా పరిశ్రమను ఆదుకుంటారు. ఒకప్పుడు నిర్మాత చెప్పిన ప్రకారం హీరో, డైరెక్టర్ నడుచుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.అయినా కొన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు మంచి కథలు ఉన్న భారీ ప్రాజెక్టులు టేకాఫ్ చేస్తూ సక్సెస్ ను పొందుతున్నాయి. అలాంటి వాటిలో ప్రముఖంగా చెప్పుకునేది ‘హోంబలే’.

    కర్ణాటకలో ‘హోంబలమ్మ’ను ఆరాధ్య దేవతగా కొలుస్తారు. టెక్నాలజీ రంగంలో దూసుకుపోయినా ఓ ముగ్గురికి ఈ అమ్మవారిపై దైవ భక్తి ఎక్కువే. అలా ఆమె పేరుతో ‘హోంబలే’ నిర్మాణ సంస్థను 2013లో ప్రారంభించారు. విజయ్ కిరంగదూర్, చలువే గౌడ, కార్తీక్ గౌడ్ అనే ముగ్గురు ‘హోంబలే’ ఫిల్మ్స్ ఏర్పడడానికి కారణం. వీరు ముగ్గురు స్నేహితులు. సినిమాలపై ఉన్న ఆసక్తితో అప్పటి వరకు వివిధ రంగాల్లో సంపాదించిన డబ్బుతో మొదటి సినిమాను పునీత్ రాజ్ కుమార్ తో ‘నిన్నిందలే’ 2014 లో రిలీజ్ చేశారు. కానీ ఈ సినిమా ఫ్లాప్ అయింది. అప్పటి వరకు వారు సంపాదించిన డబ్బంతా పోయింది.

    అయితే అక్కడితో వారు నిరాశ చెందలేదు. ఎక్కడ పోగొట్టుకున్నామో.. అక్కడే తెచ్చుకోవాలి.. అని అనుకొని 2015లో యశ్ తో కలిసి ‘మాస్టర్ పీచ్’ను తీశారు. ఈ సినిమా కాస్త పేరు తెచ్చిపెట్టింది. ఇక అక్కడితో ఆగకుండా మరోసారి పునీత్ రాజ్ కుమార్ తో 2017లో ‘రాజకుమార’ అనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందు ఉంచారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్టుకొట్టింది. ఆ సమయంలో రూ.76 కోట్లు వసూలు చేసింది.

    అప్పటి వరకు యాక్షన్, లవ్ డ్రామా చిత్రాలు తీసిన ‘హోంబలే’ ఫిల్మ్స్ వెంటనే ‘కేజీఎఫ్ చాప్టర్ 1’ను ప్రారంభించారు. కాస్త సమయం తీసుకున్నా ఈ సినిమా కన్నడంలో సక్సెస్ అయితే చాలు అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో ఇతర భాషల్లోనూ వసూళ్ల పంట పండించింది. రూ.80 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ మూవీ ఓవరాల్ గా రూ.250 కోట్లు రావడంతో మొదటి ప్రాంతీయ చిత్రంగా రికార్డుల్లోకెక్కింది. ఇదే ఊపులో కేజీఎఫ్ చాప్టర్ 2 ను కూడా రిలీజ్ చేశారు. ఇది రూ.1250 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది. అయితే ఓ వైపు కేజీఎఫ్ ను తీస్తూ.. మరోవైపు పునీత్ రాజ్ కుమార్ తో ‘యువరత్న’ను తీసుకొచ్చారు. ఆ సినిమా బంపర్ హిట్టు కొట్టడంతో ఈ సంస్థకు డబుల్ ధమాకా వచ్చినట్లయింది.

    Hombale Films

    ఇక లేటెస్ట్ గా ‘హోంబలే’ ఫిల్మ్స్‘కాంతారా’ను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా అశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. వాస్తవానికి ఈ సినిమా ప్రాంతీయ స్థాయిలో సక్సెస్ అవుతుందని అనుకున్నారు.కానీ కేవలం రూ.16 కోట్లతో కర్ణాటకలోని సంస్కృతిని చూపెట్టారు. ఇప్పటికే ఈ సినిమా రూ.340 కోట్లు వసూళ్లు సాధించడం మామూలు విషయం కాదు. ఓ వైపు భారీ బడ్జెట్ మూవీస్ తో పాటు మరోవైపు చిన్న బడ్జెట్ సినిమాలు తీస్తూ ‘హోంబలే’ ఫిల్మ్స్ ప్రత్యేకత చాటుకుంటోంది. మరో విశేషమేంటంటే ‘హోంబలే’ ఫిల్మ్స్ ఆధ్వర్యంలో ప్రభాస్ మూవీ ‘సాలార్’ రెడీ అవుతోంది. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.

    Tags