Unstoppable With NBK Season 2: నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఆహా మీడియా లో ప్రసారమైన ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో ఎంత పెద్ద సెన్సషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికి తెలిసిందే..టాలీవుడ్ టాప్ సెలబ్రిటీస్ అందరూ ఈ షో లో పాల్గొని బాలయ్య బాబు తో చిట్ చాట్ చేసారు..మొదటి సీజన్ కి ఊహించని రెస్పాన్స్ రావడం తో రెండవ సీజన్ ని ఇటీవలే ఘనంగా ప్రారంభించారు..మొదటి ఎపిసోడ్ మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు మరియు ఆయన తనయుడు లోకేష్ బాబు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

ఈ ఎపిసోడ్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చలకు దారితీసే రేంజ్ లో హిట్ అయ్యింది..ఇక రెండవ ఎపిసోడ్ కి యువ హీరోలైన విశ్వక్ సేన్ మరియు సిద్దు జొన్నలగడ్డ హాజరయ్యారు..ఈ ఎపిసోడ్ కి కూడా రెస్పాన్స్ అదిరిపోయింది..కానీ మూడవ వారం ప్రసారం అవ్వాల్సిన ఎపిసోడ్ సెలెబ్రిటీలు ఎవ్వరు దొరకకా ప్రసారం కాలేదు..ప్రతి శుక్రవారం సరికొత్త సెలబ్రిటీ తో దర్శనమిచ్చే ఈ షో మూడవ వారం మాత్రం గ్యాప్ పడింది..అందువల్ల మొదటి ఎపిసోడ్ సెన్సార్ అవ్వని కట్ ని ఆ వారం అప్లోడ్ చేసారు.
ఇక నాల్గవ వారం శర్వానంద్ మరియు అడవిశేష్ వంటి హీరోలు హాజరయ్యారు..ఈ ఎపిసోడ్ కి కూడా మంచి వ్యూస్ వచ్చాయి..కానీ ఇప్పుడు 5 వ వారం కూడా మూడవ వారం లాగానే సెలెబ్రిటీల డేట్స్ దొరకకపోవడం వల్ల షూటింగ్ జరగలేదని తెలుస్తుంది..కొద్దీ రోజుల క్రితమే అక్కినేని నాగార్జున మరియు విక్టరీ వెంకటేష్ వంటి హీరోలను ఈ షో లో పాల్గొనేలా చెయ్యడానికి ఆహా టీం సంప్రదించారట.

వెంకటేష్ ముంబై లో జరుగుతున్న షూటింగ్ లో బిజీ అవ్వడం వల్ల హాజరు కావడానికి వీలు కుదరకపోగా..అక్కినేని నాగార్జున మాత్రం మొహమాటం లేకుండానే ఈ షో లో పాల్గొనడానికి నో చెప్పినట్టు తెలుస్తుంది..మరోపక్క ఈ సీజన్ చివరి ఎపిసోడ్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తాడని ప్రచారం బాగా జరిగింది..అది ఎంత వరుకు నిజమో తెలీదు కానీ..మొదటి సీజోన్లో లాగ ఈసారి క్రేజీ ఆర్టిస్టుల డేట్స్ దొరకడం ఆహా టీం కి చాలా కష్టం అయిపోతుందట..ఇలా గత సీజన్స్ లో గాప్స్ అయితే రాలేదు.