Sriya Reddy: ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్.. ఈ డైలాగ్ గుర్తుందా… ఖడ్గం సినిమాలోని ఈ డైలాగ్ సినిమా ఛాన్స్‌ల కోసం తిరిగే ప్రతి ఒక్కరినీ ఇప్పటికీ కన్నీరు పెట్టిస్తుంది. ఇక ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా.. ప్రతీ ఆర్టిస్ట్ జీవితాన్ని మార్చేస్తుంది. ఎన్నో ఏళ్లు.. ఎన్నో సినిమాలు చేసినా రాని గుర్తింపు ఒక్క సినిమాతో వచ్చేస్తుంది. నీలాంబరిగా, శివగామిగా మెప్పించిన రమ్మకృష్ణ తెలుగు అభిమానులను ఆకట్టుకుంది. ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా మరో నటి.. అంతటి గుర్తింపును అందుకుంది. ఆమె ఎవరో కాదు.. శ్రేయారెడ్డి. సలార్ సినిమాతో ఈమె తెలుగుకు రీ ఎంట్రీ ఇచ్చింది. రాధా రమగా సలార్ లో ఆమె నటన నెక్ట్స్ లెవల్. ఖాన్సార్‌ను ఆమె ఏ రేంజ్‌లో వణికించిందో సలార్ చూస్తే తెలుస్తోంది. సలార్ రిలీజ్ అయ్యిన దగ్గరనుంచి శ్రేయారెడ్డి పేరు మార్మోగుతోంది. అసలు ఎవరు ఈ శ్రేయారెడ్డి అని ఆరాలు తీయడం మొదలుపెట్టారు.
తెలుగు సినిమాతోనే ఇండస్ట్రీకి..
శ్రేయారెడ్డి.. కెరీర్ ప్రారంభించిందే తెలుగు సినిమాతో అని చాలామందికి తెలియదు. రాజా హీరోగా అప్పుడప్పుడు అనే సినిమాలో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేనప్పటికీ.. శ్రేయాకు వరుస అవకాశాలను అందించింది. ఇక ఈ భామ.. కెరీర్ టర్నింగ్ పాయింట్ అంటే.. పొగరు. విశాల్ హీరోగా నటించిన ఈ చిత్రంలో అతడిని పిచ్చిగా ప్రేమించే విలన్ పాత్రలో శ్రేయా నటించింది అనడం కన్నా జీవించింది.
విశాల్‌కు వదినగా మారింది..
పొగరులో విషాల్ ప్రియురాలుగా నటించిన శ్రీయారెడ్డికి ఈ సినిమా జీవితాన్ని కూడా ఇచ్చింది. ఈ సినిమా సెట్‌లోనే శ్రేయా.. విశాల్ అన్న విక్రమ్‌తో ప్రేమలో పడింది. ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్లి వరకూ వెళ్లింది. పెళ్లి తరువాత సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన శ్రేయా.. ఈ ఏడాది నుంచే రీ ఎంట్రీ ఇచ్చింది. సుడల్ అనే వెబ్ సిరీస్.. ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. మధ్యలో కొన్ని సినిమాలు చేసినా.. మళ్లీ శ్రేయాకు టర్నింగ్ పాయింట్ ఇచ్చింది సలార్. పొగరు సినిమాలో అందరూ విమర్శించే పాత్ర నుంచి సలార్‌లో ఆమె నటనకు ఫిదా అయ్యే పాత్ర వరకు శ్రేయా ఎదిగిన తీరు అద్భుతమని చెప్పుకోవచ్చు. ఈ ఒక్క సినిమాతో శ్రేయా పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ తెచ్చింది.
టాలీవుడ్ కి మరో రమ్యకృష్ణ..
సలార్ సినిమాలో ఏ పాత్ర కూడా ప్రశాంత్ నీల్ అనవసరంగా పెట్టలేదు. ఆఖరికి హీరోయిన్ శృతిహాసన్ కథని డ్రైవ్ చేసే క్యారెక్టర్ చేపించారు. కానీ, ఈ చిత్రంలో హీరోయిన్ కన్నా ఎక్కువ మార్కులు సంపాదించింది శ్రియారెడ్డి. సలాడ్ రెండో భాగం మొత్తం శ్రియారెడ్డికి చాలా ప్రధానమైన పాత్ర ఉండబోతుంది అని అర్థమవుతుంది. ఈ చిత్రంలో ముఖ్యమైన విలన్‌గా శ్రీయా కనిపించింది. సలార్‌లో శ్రియారెడ్డిని చూసినవారంతా నరసింహాలో రమ్యకృష్ణ.. బాహుబలిలో రమ్యకృష్ణ పాత్రలను గుర్తుచేసుకుంటున్నారు. హీరోయిన్స్‌లో నెగిటివ్ క్యారెక్టర్లు చేయగలిగే వారు తక్కువ. రమ్యకృష్ణ తరువాత ఆ రేంజ్ నటి శ్రియారెడ్డి అని నెటిజన్స్ తెగ పొగిడేస్తున్నారు.
క్రికెట్‌తోనూ లింక్..
శ్రేయారెడ్డి తండ్రి భరత్‌రెడ్డి చెన్నైలో జన్మించారు. అంతర్జాతీయ స్థాయిలో టీమిండియా జట్టు తరుపున పలు మ్యాచ్‌ల్లో రాణించారు. 1978, 1981 మధ్య పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పై మూడు వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో వికెట్–కీపర్‌గా కొనసాగారు. అతను 1982–83 నుంచి 1985–86 వరకు తమిళనాడుకు కెప్టెన్‌గా కూడా ఉన్నారు. క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత, రెడ్డి కెంప్లాస్ట్‌లో పనిచేశారు. అతను చెన్నైలో క్రికెట్ శిక్షణ శిబిరాలు నిర్వహించడంలో తోడ్పడ్డారు. భారత టెస్ట్ ఆటగాళ్లు దినేష్ కార్తీక్, లక్ష్మీపతి బాలాజీలకు శిక్షణ ఇచ్చారు.