https://oktelugu.com/

Radhika: హిందూగా పుట్టి ముస్లిం ఫ్యామిలీలో పెరిగిన రాధిక.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Radhika: దాదాపుగా మూడు దశాబ్దాల క్రితం స్టార్ హీరోయిన్ గా రాధిక ఒక వెలుగు వెలిగారు. ప్రముఖ నటుడు ఎం.రాధా కూతురు అయిన రాధిక తన టాలెంట్ తో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. తాజాగా రాధిక ఒక ఇంటర్య్వూలో మాట్లాడుతూ తన సొంతూరు చెన్నై అని మధ్యలో శ్రీలంకకు వెళ్లి అక్కడే చదువుకున్నానని చెప్పుకొచ్చారు. భారతీరాజా గారు నన్ను కిరక్కే పొగుమురై మూవీ కొరకు ఎంపిక చేయడంతో సినిమాల్లో ఆఫర్లు వచ్చాయని ఆమె చెప్పుకొచ్చారు. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : April 20, 2022 / 03:37 PM IST
    Follow us on

    Radhika: దాదాపుగా మూడు దశాబ్దాల క్రితం స్టార్ హీరోయిన్ గా రాధిక ఒక వెలుగు వెలిగారు. ప్రముఖ నటుడు ఎం.రాధా కూతురు అయిన రాధిక తన టాలెంట్ తో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. తాజాగా రాధిక ఒక ఇంటర్య్వూలో మాట్లాడుతూ తన సొంతూరు చెన్నై అని మధ్యలో శ్రీలంకకు వెళ్లి అక్కడే చదువుకున్నానని చెప్పుకొచ్చారు. భారతీరాజా గారు నన్ను కిరక్కే పొగుమురై మూవీ కొరకు ఎంపిక చేయడంతో సినిమాల్లో ఆఫర్లు వచ్చాయని ఆమె చెప్పుకొచ్చారు.

    Radhika

    తెలుగులో ప్రియ సినిమాలో మొదట నటించినా న్యాయం కావాలి మొదట విడుదలైందని ఆమె చెప్పుకొచ్చారు. న్యాయం కావాలి సినిమాతో లైఫ్ టర్న్ అయిందని ఆమె వెల్లడించారు. తెలుగు సినిమాలలో నటించే సమయంలో తెలుగు భాష రాదు కాబట్టి చాలా టెన్షన్ గా ఉండేదని రాధిక పేర్కొన్నారు. రేపు అనే పదం వింటే ఆ పదానికి అర్థం తెలియక భయపడేదానినని ఆమె చెప్పుకొచ్చారు.

    Also Read: Power Star Pavan Kalyan: ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ చెయ్యబోతున్న పవర్ స్టార్.. షాక్ లో ఫాన్స్

    ఒక సన్నివేశంలో చిరంజీవిని కొట్టి కొట్టి మాట్లాడాలని ఆ సీన్ కోసం 23 టేకులు తీసుకున్నానని ఆమె కామెంట్లు చేశారు. ఆ సీన్ తర్వాత చిరంజీవికి సారీ చెప్పానని ఆమె తెలిపారు. నా చేతిలో దెబ్బలు తిన్నవాళ్లంతా పైకి వచ్చారని ఆమె కామెంట్లు చేశారు. నాన్న సొంతూరుకు తిరుపతికి సమీపంలో ఉండేదని మేము తెలుగువాళ్లమే అని రాధిక తెలిపారు. సినిమాలలో నటించిన తర్వాత మంచి తెలుగు మాట్లాడుతున్నానని ఆమె వెల్లడించారు.

    మా తల్లికి సకినా ఆంటీ స్నేహితురాలని, హౌజీ అంకుల్ శ్రీలంకలో మంత్రిగా ఉండేవారని ఫాదర్ కోర్టు ఇష్యూ ఉన్న సమయంలో వాళ్లు గార్డియన్ గా ఉన్నారని ఆ సమయంలో ముస్లిం ఫ్యామిలీలో పెరిగామని హిందూగా పుట్టినా తాను ముస్లిం ప్రార్థనలు చేశానని చదివిన స్కూల్ మాత్రం క్రిస్టియన్ స్కూల్ అని రాధిక చెప్పుకొచ్చారు.

    Also Read:YS Sharmila: పాద‌యాత్ర చాలు.. అమెరికా వెళ్దాం.. ష‌ర్మిల‌మ్మను ఎవ‌రూ ప‌ట్టించుకోరే..!

    Recommended Videos: