Childhood Photo: ఈ ఫొటోలో ఉన్న బుడ్డోడు ఎవరో గుర్తుపట్టారా..? ప్రస్తుతం ఇతనికి పోటీని ఇచ్చే స్టార్ హీరో లేడు..అంత పెద్ద సూపర్ స్టార్!

తమిళనాట సూపర్ స్టార్ రజినీకాంత్ లాంటి స్టార్ స్టేటస్ ఉన్న హీరో మళ్ళీ వస్తాడా? అని అనుకుంటున్న సమయం లో పెను తుఫాన్ లాగ దూసుకొచ్చాడు విజయ్. ఒకప్పుడు తమిళ నాట నాన్ రజినీకాంత్ రికార్డ్స్ అనే క్యాటగిరీ ఉండేది.

Written By: Vicky, Updated On : June 19, 2023 5:40 pm

Childhood Photo

Follow us on

Childhood Photo: క్రింది ఫొటోలో చిలిపి కృష్ణుడి అవతారం లో కనిపిస్తున్న ఈ బుడ్డోడు ఎవరో గుర్తు పట్టారా?, ఒకప్పుడు ఇతను ఏమి హీరో రా బాబు అనుకున్నారు, కానీ అతనే ఇప్పుడు సౌత్ ఇండియన్ మార్కెట్ కి రారాజు గా మారిపోయాడు. నిర్మాతలు ఇతను కాల్ షీట్స్ కోసం ప్రస్తుతం తపస్సు చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ఫ్లాప్ సినిమాలు సైతం బాక్స్ ఆఫీస్ వద్ద కేవలం తన స్టార్ స్టేటస్ కారణంగా సూపర్ హిట్స్ గా మారిపోతున్నాయి.

ఇలాంటి స్టార్ స్టేటస్ ప్రస్తుతం ఏ హీరోకి కూడా ఉండదేమో. స్టార్ డైరెక్టర్ కొడుకుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినా , ఏమాత్రం అహంకారం లేకుండా, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ కి వస్తే ఎలా ఉంటుందో అలా కష్టపడ్డాడు. హిట్టు హిట్టు మీద హిట్ కొడుతూ ప్రస్తుతం ఎవ్వరూ ముట్టుకోలేని రేంజ్ కి వెళ్ళాడు. ఆ హీరో ఎవరో మరెవరో కాదు ఇళయ తలపతి విజయ్.

తమిళనాట సూపర్ స్టార్ రజినీకాంత్ లాంటి స్టార్ స్టేటస్ ఉన్న హీరో మళ్ళీ వస్తాడా? అని అనుకుంటున్న సమయం లో పెను తుఫాన్ లాగ దూసుకొచ్చాడు విజయ్. ఒకప్పుడు తమిళ నాట నాన్ రజినీకాంత్ రికార్డ్స్ అనే క్యాటగిరీ ఉండేది. కానీ ఇప్పుడు నాన్ విజయ్ రికార్డ్స్ క్యాటగిరీ అనే స్థాయికి ఎదిగిపోయాడు హీరో విజయ్. ఆయన ఏది చేసినా ప్రస్తుతం ఒక సెన్సేషన్ అయిపోతుంది. తమిళనాడు లో ప్రస్తుతర్హామ్ టాప్ 10 హైయెస్ట్ గ్రాసర్ గా నిల్చిన సినిమాల లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా కనీసం 5 సినిమాలైనా విజయ్ ఖాతాలో ఉంటాయి. ఈ రేంజ్ డామినేషన్ అప్పట్లో రజినీకాంత్ కి ఉండేది. ఇప్పుడు ఆయన తర్వాత ఆ స్థాయికి చేరుకుకున్న హీరో గా విజయ్ నిలిచాడు.

ఈ ఏడాది ఆయన పొంగల్ కి ‘వారసుడు’ అనే సినిమాతో మన ముందుకు వచ్చాడు, ఇప్పుడు ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ తో ‘లియో’ అనే సినిమా చేస్తున్నాడు, ఈ చిత్రం తర్వాత వెంకట్ ప్రభు తో మరో సినిమా చెయ్యబోతున్నాడు. ఈ రెండు చిత్రాల తర్వాత ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయ అరంగేట్రం చేయబోతున్నాడని టాక్.