https://oktelugu.com/

Naresh- Pavitra Lokesh: నరేష్ ను పవిత్రాలోకేష్ అందుకే లోబరుచుకుందట?

వీరిద్దరిని పెట్టి మళ్లీ పెళ్లి అనే సినిమా కూడా తీశారు. కానీ వీరు మాత్రం తమ జంట కలకాలం ఉంటుదనే సందేశాన్ని వినిపిస్తోంది. నరేష్ కు ఇది నాలుగో పెళ్లి కాగా పవిత్రకు ఇది రెండోది. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా ఇంకా యవ్వనంగా ఉన్నట్లు ఫీలవుతోంది. ఈ నేపథ్యంలో వారు పెళ్లి చేసుకున్నారనే వార్తలు కూడా అందరిని ఆశ్చర్య పరుస్తున్నాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : June 19, 2023 / 05:46 PM IST

    Naresh- Pavitra Lokesh

    Follow us on

    Naresh- Pavitra Lokesh: సినిమా పరిశ్రమలో ప్రస్తుతం కథ మొత్తం నరేష్, పవిత్రల చుట్టూ తిరుగుతోంది. ఈ వయసులో వారు టీనేజ్ లో మాదిరి ఎంజాయ్ చేస్తున్నారు. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అని చెలరేగిపోతున్నారు. వీరి జంట టాలీవుడ్ టాక్ ఆఫ్ ది ఎట్రాక్షన్ గా మారింది. ఇంత లేటు వయసులో ఎంత ఘాటు ప్రేమయో అని పాడుకుంటున్నారు. ఒకరినొకరు విడిచి ఉండటం లేదు. అరవై ఏళ్లొచ్చాక గోడ పట్టుకుని నాకు నడక వచ్చిందని సంబర పడిన ముసలి వారిలో వారి ప్రవర్తన ఉంటోంది.

    వీరిద్దరిని పెట్టి మళ్లీ పెళ్లి అనే సినిమా కూడా తీశారు. కానీ వీరు మాత్రం తమ జంట కలకాలం ఉంటుదనే సందేశాన్ని వినిపిస్తోంది. నరేష్ కు ఇది నాలుగో పెళ్లి కాగా పవిత్రకు ఇది రెండోది. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా ఇంకా యవ్వనంగా ఉన్నట్లు ఫీలవుతోంది. ఈ నేపథ్యంలో వారు పెళ్లి చేసుకున్నారనే వార్తలు కూడా అందరిని ఆశ్చర్య పరుస్తున్నాయి.

    ఈ నేపథ్యంలో పవిత్ర గురించి ఆమె మాజీ భర్త సుచేంద్ర ప్రసాద్ ఆసక్తికర కామెంట్లు చేశాడు. పవిత్రకు డబ్బంటే చాలా ఇష్టం. అందుకే నరేష్ పక్కన చేరింది. నరేష్ తల్లి విజయనిర్మల కూడబెట్టిన రూ.1500 కోట్లు కరిగించేస్తుంది. డబ్బు అయిపోయాక మరొకరిని చూసుకోవడం తథ్యం. ఇలా మాట్లాడటంతో అతడి వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి.

    నరేష్, పవిత్ర పెళ్లి చేసుకున్నారని కొందరంటుంటే లేదు ఇంకా పెళ్లి చేసుకోలేదు. ప్రేమికులుగానే చలామణి అవుతున్నారని అంటున్నారు. ఇలా వృద్ధాప్యంలో కూడా ప్రేమను పంచుకోవడం నిజంగా గమ్మత్తుగానే ఉంది. వారి వయసు యాభై దాటినా వయసులో ఉన్న వారిలా వారి ప్రవర్తన అందరికి వింతగానే తోస్తోంది. మనవళ్లను ఎత్తుకునే వయసులో వారి చేష్టలు కొందరికి ఆశ్చర్యాన్ని కలిగించడం మామూలే.