Hero Surya: సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ ని సంపాదించుకున్న హీరోలలో ఒకరు సూర్య. కమల్ హాసన్ తరహాలో విభిన్నమైన పాత్రలు చేస్తూ, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని అతి తక్కువ సమయంలోనే తెచ్చుకున్నాడు. శివ పుత్రుడు చిత్రంతో మొదటిసారి ఆయన మన తెలుగు ఆడియన్స్ కి పరిచయమయ్యాడు. ఆ తర్వాత ఆయన హీరో గా నటించిన ‘గజినీ’ చిత్రం తెలుగు లో దబ్ అయ్యి పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత సూర్య కి తెలుగు ఆడియన్స్ లో ఏర్పడిన క్రేజ్ మామూలుది కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే రజినీకాంత్ కి అప్పట్లో తెలుగు మార్కెట్ ఏ రేంజ్ లో ఉండేదో. సూర్య కి కూడా అదే రేంజ్ మార్కెట్ ఏర్పడింది. కేవలం తెలుగులో మాత్రమే కాదు, మలయాళం మరియు కన్నడ భాషల్లో కూడా సూర్య కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలా రజినీకాంత్ తర్వాత ఒక తమిళనటుడికి అదే స్థాయి క్రేజ్ రావడం కేవలం సూర్య కి మాత్రమే జరిగింది.
అయితే సూర్య గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మేము మీ ముందుకు ఉంచబోతున్నాము. సూర్య ప్రముఖ తమిళనటుడు శివ కుమార్ తనయుడు. చిన్నప్పటి నుండి సూర్య కి సొంతంగా, తన తండ్రి పేరు వాడుకోకుండా పైకి రావాలి అనే తపన ఉండేది. అందులో భాగంగానే ఆయన తన డిగ్రీ పూర్తి చెయ్యగానే, ఒక గార్మెంట్ కంపెనీ లో 750 రూపాయిల నెల జీతం కోసం పనిచేసేవాడు. ఆ ఉద్యోగంలో చేరేముందు తాను శివ కుమార్ కొడుకు అనే విషయం, గార్మెంట్ కంపెనీ యాజమాన్యం కి తెలియదు. అలా కొంతకాలం ఉద్యోగం చేసిన సూర్య గురించి యాజమాన్యంకి తెలిసిపోయింది. అతను తమిళం లో స్టార్ నటుడు శివ కుమార్ కొడుకు అని తెలియడంతో ఆ యజమాని ఆశ్చర్యపోయాడు. ఇక తన గుర్తింపు బహిర్గతం అవ్వడంతో సూర్య ఆ కంపెనీ లో ఉద్యోగం మానేసాడు. ఉద్యోగం మానేసిన తర్వాత ఆయన సినిమాల్లోకి రావాలని అసలు కోరుకులేదట, ఏదైనా వ్యాపారం చేసుకోవాలి అనే ఉద్దేశ్యంతోనే అడుగులు వేసేవాడట.
1995 వ సంవత్సరంలోనే ఆయనకి హీరోగా నటించే అవకాశం దక్కింది, కానీ నటన మీద ఆసక్తి లేదని చెప్పి ఆ సినిమాకి ఒప్పుకోలేదు. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ, సూర్య హీరో గా ‘నెరుక్కునెర్’ అనే సినిమాతో వెండితెర అరంగేట్రం చేసాడు. ఆ తర్వాత ఆయన వరుసగా సినిమాలు చేస్తూ హిట్టు మీద హిట్టు కొడుతూ ఈ స్థాయికి చేరుకున్నాడు. అయితే ప్రస్తుతం సూర్య ఫ్లాప్స్ లో ఉన్నాడు. ఆయన అభిమానులు భారీ కం బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కంగువ’ పై భారీ అంచనాలు ఉన్నాయి. నవంబర్ లో ఈ చిత్రం విడుదల కాబోతున్నట్టు లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. ఈ సినిమాతో సూర్య భారీ హిట్ కొడతాడా లేదా అనేది చూడాలి.