Priyanka Chopra
Priyanka Chopra: ఎస్ఎస్ఎంబి 29ని దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మహేష్ బాబుతో చేస్తున్న ఫస్ట్ మూవీ ఇది. రాజమౌళి కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో ఎస్ఎస్ఎంబి 29 నిర్మిస్తున్నారు. దాదాపు రూ. 1000 కోట్ల బడ్జెట్ అని సమాచారం. జంగిల్ అడ్వెంచర్ డ్రామాగా ఎస్ఎస్ఎంబి 29 ఉంటుంది. మహేష్ బాబుని ఒక సాహసవీరుడిగా చూపించనున్నారు. కాగా ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుందంటూ ఊహాగానాలు తెరపైకి వచ్చాయి.
ఈ పుకార్లకు బలం చేకూరుస్తూ.. ఇటీవల ప్రియాంక చోప్రా,రాజమౌళి, కీరవాణి కలిసి దిగిన ఫోటో బయటకు వచ్చింది. అధికారికంగా ప్రకటించినప్పటికీ ప్రియాంక చోప్రా ఎస్ఎస్ఎంబి 29 హీరోయిన్ అని జనాలు ఫిక్స్ అయ్యారు. హాలీవుడ్ చిత్రాలు చేస్తున్న ప్రియాంకను ఎస్ఎస్ఎంబి 29కి బెస్ట్ ఛాయిస్ గా రాజమౌళి భావించి ఉండొచ్చు.
రాజమౌళి-మహేష్ బాబు మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుందన్న వార్తల నేపథ్యంలో ప్రియాంక చోప్రాకు సంబంధించిన పలు విషయాలు చర్చకు వస్తున్నాయి. గతంలో ప్రియాంక చోప్రా క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించారు. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆమె తెలియజేశారు. 19 ఏళ్ల ప్రాయంలో సినిమా అవకాశం కోసం ఓ దర్శకుడిని ప్రియాంక చోప్రా కలిశారట. సదరు దర్శకుడు అసభ్యంగా ప్రవర్తించాడట.
నీ ప్యాంటీస్, లో దుస్తులు కనిపించేలా కూర్చోవాలి, నటించాలి.. అప్పుడే ఆడియన్స్ ఈ సినిమా చూస్తారు, అన్నాడట. ఇంటికి వచ్చిన ప్రియాంక చోప్రా.. ఈ విషయం తల్లి మధు చోప్రాతో చెప్పిందట. అనంతరం ప్రియాంక చోప్రా ఆ దర్శకుడితో ఒక్క సినిమా కూడా చేయలేదట. మహిళలకు పరిశ్రమలో ఎదురయ్యే లైంగిక వేధింపుల ప్రస్తావన రాగా, ప్రియాంక చోప్రా ఆ సంఘటన బయటపెట్టారు.
2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్ టైటిల్ అందుకుంది. 2002లో విడుదలైన తమిజా ఆమె మొదటి చిత్రం. ఈ మూవీలో విజయ్ హీరో కావడం విశేషం. బాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన ప్రియాంక చోప్రా స్టార్ గా ఎదిగారు. తెలుగులో రామ్ చరణ్ కి జంటగా జంజీర్ చేశారు. ప్రియాంక సౌత్ చిత్రాలు పెద్దగా చేయలేదు.
Web Title: Priyanka chopra reacts on the casting couch
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com