మొదటి సినిమాతోనే వెండితెర పై తమ తళుకుబెళుకులతో ఒక వెలుగు వెలిగిన, ఆ తర్వాత అర్ధంతరంగా కనుమరుగైపోయిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. వారిలో ఒకరిగా నేటి ఐటమ్ వార్తగా నిలిచింది ‘నేహా బాంబ్’. ఏమిటి ఈ పేరు ఎక్కడా వినలేదు అనుకుంటున్నారు. వినాయక్ ‘దిల్’ సినిమా చూసే ఉంటారుగా. ఆ సినిమాలో హీరోయినే ‘నేహా బాంబ్’.
హీరోతో పీకల్లోతు ప్రేమలో మునిగి నానిపోయే హీరోయిన్ పాత్రలో ఈ భామ చక్కగా నటించకపోయినా ఉన్నంతలో పర్వాలేదనిపించింది. కాకపోతే సినిమా సూపర్ హిట్. పైగా నేహా కూడా మంచి అందగత్తె. అప్పుడే విరబూసిన పారిజాతంలా ఎంతో కోమలంగా సుకుమారంగా ఉంటుంది. ఇంత ఉన్నా ఏమి లాభం ? అమావాస్య లో పున్నమి వెన్నెలకు మల్లె ఒక్కసారిగా మాయమైపోయింది.
మరి ఇప్పుడు ఆ హీరోయిన్ ఎక్కడుంది ? ఏమి చేస్తోంది ? అసలు ఎలా ఉంది? లాంటి నెటిజన్ల ప్రశ్నలకు సమాధానం దొరికింది. నేహా, రిషిరాజ్ జవేరీని పెళ్లి చేసుకుంది. అతను బిజినెస్ మెన్. ఇక ప్రస్తుతం నేహా అయితే హౌస్ వైఫ్ గా తన లైఫ్ ను లీడ్ చేస్తోంది. ఆమె ఇప్పుడు తల్లిగా కూడా ప్రమోషన్ పొందింది. తన పూర్తి సమయాన్ని తన పిల్లల కోసమే కేటాయిస్తోందట.
నిజానికి నేహా బాంబ్ కి తిరిగి సినిమాల్లోకి రావాలని ఉందట. కానీ కుటుంబ బాధ్యతలు కారణంగా సినిమాల పై ఆసక్తి చూపించడం లేదు అని, భవిష్యత్తులో కచ్చితంగా మంచి పాత్రలతో మళ్ళీ వెండితెర పై నాదైన శైలిలో రెచ్చిపోవాలని ఉందంటూ కబుర్లు చెప్పుకొచ్చింది నేహా బాంబ్. మరి నేహా కోరిక కలగానే మిగిలపోతుందో, లేక నెరవేరుతుందో కాలమే చెప్పాలి.