https://oktelugu.com/

Remake Movie: రీమేక్ చేసిన ప్రతి భాషలో బ్లాక్ బస్టర్, తెలుగులో మాత్రం డిజాస్టర్… స్టార్ హీరోకి షాక్ ఇచ్చిన ఆ మూవీ ఏమిటో తెలుసా?

ఓ మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ రీమేక్ చేసిన అన్ని భాషల్లో సూపర్ హిట్ కొట్టింది. కానీ తెలుగులో ఆ సినిమా ఆడలేదు. ఓ స్టార్ హీరోకి ఆ సినిమా కలిసి రాలేదు. నాలుగు భాషల్లో వందల కోట్ల వసూళ్లు రాబట్టిన ఆ చిత్రం తెలుగులో ఎవరు చేశారో చూద్దాం..

Written By:
  • S Reddy
  • , Updated On : September 4, 2024 / 02:20 PM IST

    Remake Movie

    Follow us on

    Remake Movie: ఒక భాషలో విజయం సాధించిన చిత్రం ఇతర భాషల్లోకి రీమేక్ కావడం సాధారణమే. అయితే ప్రతి భాషలో ఆ మూవీ సక్సెస్ అవుతుందనే గ్యారంటీ లేదు. అందుకు పలు కారణాలు ఉన్నాయి. ఒక ప్రాంతం, భాషా, నేటివిటీకి సంబంధించిన కథ ఇతర భాషలకు సెట్ కాకపోవచ్చు. కొన్ని సినిమాల కథలు మాత్రం అన్ని భాషల్లో సక్సెస్ అవుతాయి. మలయాళ చిత్రం దృశ్యం అందుకు నిదర్శనం. దృశ్యం మూవీ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సైతం మంచి విజయం అందుకుంది. అది క్రైమ్ థ్రిల్లర్ కావడంతో వర్క్ అవుట్ అయ్యింది.

    మరొక మలయాళ చిత్రాన్ని ఇతర భాషల్లో రీమేక్ చేయగా మంచి విజయం అందుకుంది. ఆ చిత్రం పేరు బాడీగార్డ్. 2010లో విడుదలైన ఈ మలయాళ చిత్రంలో దిలీప్, నయనతార జంటగా నటించారు. వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రాన్ని హిందీలో సల్మాన్ ఖాన్ రీమేక్ చేశాడు. సల్మాన్ ఖాన్, కరీనా కపూర్ జంటగా నటించిన ఈ మూవీ భారీ విజయం అందుకుంది. సల్మాన్ కెరీర్లో బాడీగార్డ్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో చేరింది.

    తమిళంలో విజయ్-అసిన్ జంటగా బాడీగార్డ్ మూవీ రీమేక్ చేశారు. తమిళంలో కూడా విజయం అందుకుంది. వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన బాడీగార్డ్ మూవీ విజయ్ ఇమేజ్ కి ప్లస్ అయ్యింది. తమిళంలో ఈ మూవీని కావలన్ అనే టైటిల్ తో విడుదల చేశారు. ఇక తెలుగులో వెంకటేష్ చేశారు. తెలుగు బాడీగార్డ్ కి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు.

    వెంకటేష్ కి జంటగా త్రిష నటించింది. సలోని సపోర్టింగ్ రోల్ చేసింది. తెలుగులో మాత్రం బాడీగార్డ్ ఆడలేదు. డిజాస్టర్ గా నిలిచింది. తెలుగు ఆడియన్స్ కి ఈ కథ అంతగా నచ్చలేదు. దాంతో బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. మిగతా భాషల్లో విజయం సాధించిన బాడీగార్డ్ తెలుగులో అనూహ్యంగా దెబ్బతింది.

    బాడీగార్డ్ మూవీ కథ విషయానికి వస్తే… ఓ పెద్దాయనను హీరో అమితంగా ఇష్టపడతాడు. ఆ పెద్దాయన కుటుంబానికి శత్రువుల నుండి ఆపద ఉందని తెలిసిన హీరో బాడీగార్డ్ గా వెళతాడు. పెద్దాయన కూతురు కాలేజ్ లో చదువుతుంది. ఆమెకు కూడా హీరో రక్షణగా ఉంటాడు. అది హీరోయిన్ కి నచ్చదు. అతడి రూల్స్, రెగ్యులేషన్స్ కి విసుగు చెందిన హీరోయిన్… అపరిచితురాలిగా ఫోన్ చేసి ప్రేమలో దించుతుంది. సరదాగా మొదలైన ఆమె ప్రేమ కథ… సీరియస్ రూపం తీర్చుకుంటుంది. తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ