https://oktelugu.com/

Bigg Boss 8 Telugu: ‘బిగ్ బాస్ 8’ కంటెస్టెంట్ నైనికా కష్టాలు పగోడికి కూడా రాదేమో..కన్న తండ్రి ఇంత దారుణం చేశాడా..బ్యాక్ గ్రౌండ్ చూస్తే ఏడుపు ఆగదు!

14 మంది కంటెస్టెంట్స్ ని జంటలుగా లోపలకు పంపించారు. నాని, రానా దగ్గుబాటి, అనిల్ రావిపూడి వంటి స్టార్స్ ని హౌస్ లోపలకి పంపించి పలు గేమ్స్ ఆడించారు. గేమ్స్ ఓడిపోయిన వారిని కాస్త భయబ్రాంతులకు గురి చేసారు.

Written By:
  • Vicky
  • , Updated On : September 2, 2024 / 08:04 AM IST

    Bigg Boss 8 Telugu(6)

    Follow us on

    Bigg Boss 8 Telugu: భారీ హైప్ ని ఏర్పాటు చేసుకున్న బిగ్ బాస్ సీజన్ 8 మొత్తానికి నిన్న గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈ సీజన్ ముందు సీజన్ కంటే ఎంతో ఆసక్తికరంగా ఉండబోతుంది అనేది లాంచింగ్ ఎపిసోడ్ తోనే అందరికి అర్థం అయిపోయింది. 14 మంది కంటెస్టెంట్స్ ని జంటలుగా లోపలకు పంపించారు. నాని, రానా దగ్గుబాటి, అనిల్ రావిపూడి వంటి స్టార్స్ ని హౌస్ లోపలకి పంపించి పలు గేమ్స్ ఆడించారు. గేమ్స్ ఓడిపోయిన వారిని కాస్త భయబ్రాంతులకు గురి చేసారు. మొదటి రోజే నాగ మణికంఠ ని కంటెస్టెంట్స్ అందరూ టార్గెట్ చేసి బయటకి పంపే వాతావరణం సృష్టించడం, తద్వారా అతనికి కంటెస్టెంట్స్ మధ్య మూడవ పెట్టే ప్రయత్నం చేయడం వంటివి జరిగింది. రేపటి నుండే హౌస్ హీట్ వాతావరణంలోకి వెళ్లబోతుంది అనేది అందరికి అర్థం అయిపోయింది.

    ఇదంతా పక్కన పెడితే హౌస్ లోకి చివరిగా అడుగుపెట్టిన నైనికా ‘ఢీ’ షో చూసేవారికి తప్ప ఎవరికీ తెలిసి ఉండకపోవచ్చు. హౌస్ లోకి అడుగుపెట్టిన సగం మంది కంటెస్టెంట్స్ జనాలకు పెద్దగా పరిచయం లేని వారే. అయితే నైనికా కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మేము మీ ముందు ఉంచబోతున్నాము. నైనికా పుట్టి పెరిగింది మొత్తం ఒరిస్సాలోని జార్సా గూడ అనే ప్రాంతంలోనే. ఆమె వయస్సు కేవలం 23 ఏళ్ళు మాత్రమే. చిన్న తనం నుండే ఈమె తన తండ్రి కారణంగా ఎన్నో ఇబ్బందులను ఎగురుకుంటూ వచ్చింది. ఆడపిల్ల పుట్టింది అనే బాధతో నైనికా ని, ఆమె తల్లిని ప్రతీ రోజు వేధించేవాడట. ఒక విధంగా చెప్పాలంటే చిన్నతనంలోనే నైనికా ని తండ్రి వదిలేసాడు. ఈ విషయాన్నీ ఆమె పలు ఇంటర్వ్యూస్ లో చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకుంది. అలా తండ్రి నుండి విడిపోయిన నైనికా తన తల్లితో కలిసి ఒరిస్సా నుండి హైదరాబాద్ కి వచ్చేసింది. హైదరాబాద్ లో జీవనం సాగించడం కోసం ఒరిస్సా లో ఉన్న సొంత ఇల్లుని కూడా అమ్మేసారు. ఇక జీవనోపాధి కోసం నైనికా తల్లి ఒక సలోన్ ని నడిపింది. ఇది ఇలా ఉండగా చిన్నతనం నుండి నైనికా కి డ్యాన్స్ అంటే పిచ్చి.

    ఆ పిచ్చి తోనే డ్యాన్స్ లో అనేక ఫార్మ్స్ ని నేర్చుకొని తనని తాను మెరుగుపరుచుకుంది. సినిమాల్లో అవకాశాల కోసం కూడా ఈ అమ్మాయి చాలా ప్రయత్నాలు చేసింది. ఒక డైరెక్టర్ అయితే ఆమెని ఆడిషన్స్ చేసి అవకాశం కావాలంటే కమిట్మెంట్ ఇవ్వాలని కండిషన్ పెట్టాడట. అలాంటి అవకాశం నాకొద్దు అని వెనక్కి వచ్చేసిన నైనికా ఢీ ఆడిషన్స్ లో సెలక్షన్ కమిటీ ని మెప్పించి ఆ షోలో కంటెస్టెంట్ గా అడుగుపెట్టే ఛాన్స్ కొట్టేసింది. ఆ షోలో తన అద్భుతమైన డ్యాన్స్ తో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన నైనికా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది. మరి రాబోయే రోజుల్లో ఆమె ఎంతమేరకు రాణిస్తుందో చూడాలి.