https://oktelugu.com/

Bigg Boss 8 Telugu: ‘బిగ్ బాస్ 8’ కంటెస్టెంట్ నబీల్ అఫ్రీది బ్యాక్ గ్రౌండ్ చూసారా..? ఇతని తండ్రి గొప్ప ఆదర్శవంతుడు..ఎంతోమందికి స్ఫూర్తి!

సోషల్ మీడియా పాపులారిటీ తో హౌస్ లోకి అడుగుపెట్టిన నబీల్ అఫ్రీది అనే కంటెస్టెంట్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. నబీల్ ఆఫ్రిది వరంగల్ కి చెందిన అబ్బాయి. ఇతనికి చిన్నతనం నుండి సినిమాల్లోకి వచ్చి గొప్పగా రాణించాలని కోరిక ఉండేది.

Written By:
  • Vicky
  • , Updated On : September 2, 2024 / 08:09 AM IST

    Bigg Boss 8 Telugu

    Follow us on

    Bigg Boss 8 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ రియాలిటీ ముందు సీజన్ కంటే పెద్ద హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని లాంచ్ ఎపిసోడ్ తోనే అందరికి అర్థం అయిపోయింది. కంటెస్టెంట్స్ మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం కూడా మొదలైంది. ఇక రేపటి నుండి ప్రతీ రోజు హౌస్ హీట్ వాతావరణంలో ఉండబోతుంది. ఈ సీజన్ లో కెప్టెన్ ఉండరు అనే విషయం చెప్పేయడం తో, ఇక కంటెస్టెంట్స్ ఇష్టారాజ్యంగా ఎవరికి తోచింది వారు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతారు. ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ గా అడుగుపెట్టిన 14 మందిలో చాలా మంది ప్రేక్షకులకు తెలియదు. సోషల్ మీడియా లో ఎక్కువగా పరిచయం ఉన్నవారే. సినీ రంగానికి చెందిన వారిలో కేవలం ఇద్దరే ఉన్నారు. అయితే సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ ని సంపాదించి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టడం చిన్న విషయం కాదు.

    అలా సోషల్ మీడియా పాపులారిటీ తో హౌస్ లోకి అడుగుపెట్టిన నబీల్ అఫ్రీది అనే కంటెస్టెంట్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. నబీల్ ఆఫ్రిది వరంగల్ కి చెందిన అబ్బాయి. ఇతనికి చిన్నతనం నుండి సినిమాల్లోకి వచ్చి గొప్పగా రాణించాలని కోరిక ఉండేది. కానీ అతని తండ్రి మాత్రం ఒప్పుకునేవాడు కాదు, బాగా చదువుకోవాలి అనేది ఆయన ఆశ. కానీ నబీల్ అఫ్రీది కి సినిమాల మీద ఉన్న పిచ్చిని చూసి ‘వీడిని ఇక మార్చలేం’ అనే అభిప్రాయానికి వచ్చి నీకు ఇష్టం వచ్చిన పని చేసుకో అని స్వేచ్ఛ ని ఇచ్చేసాడు. ఇలా స్వేచ్చని ఇచ్చే తల్లిదండ్రులు ఉంటే అంతకు మించిన అదృష్టం ఇంకోటి ఏముంటుంది చెప్పండి?..తండ్రి సహకారం అందంతో నబీల్ అఫ్రీది సినిమా అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరిగాడు. కాళ్ళు అరిగిపోయేలా తిరిగినా కూడా కనీసం జూనియర్ ఆర్టిస్ట్ రోల్ కూడా దొరకలేదు. ఇలా అవకాశాలు రావు, ఫేమస్ అయితేనే అవకాశాలు వస్తాయని గ్రహించి యూట్యూబ్ లో ఒక ఛానల్ ని క్రియేట్ చేసాడు. మొదట్లో ఈయన చేసే వీడియోస్ కి అసలు వ్యూస్ వచ్చేవి కాదు.

    ఎలా చెయ్యాలి అని అలోచించి వినూతన రీతిలో, సరికొత్త కాన్సెప్ట్స్ తో వీడియోలు చేయడం మొదలు పెట్టాడు. ఆయన వీడియోలు జనాలకు బాగా నచ్చింది, ఓవర్ నైట్ యూట్యూబ్ స్టార్ అయిపోయాడు, వరంగల్ కి హీరో అయ్యాడు. తన కొడుకుకి వచ్చిన పాపులారిటీ ని చూసి తండ్రి ఎంతో పొంగిపోయాడు, నా కొడుకు హీరో అయ్యాడు అంటూ ఊరంతా చెప్పుకొని తిరిగేవాడట. అలా మొదలైన నబీల్ అఫ్రీది ప్రస్థానం ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టే వరకు సాగింది. తనకి వచ్చిన ఈ అద్భుతమైన అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకొని నబీల్ బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులకు చేరువ అవుతాడా?, సినిమాల్లోకి రావాలి అనే తన చిరకాల కోరికని నెరవేర్చుకుంటాడా లేదా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. చూడాలి మరి ఇతగాడు ఎంతవరకు రాణిస్తాడో అనేది.