Bigg Boss 8 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో చాలా క్యూట్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న వారిలో ఒకరు ప్రేరణ కంభం. కుర్రాళ్ళు చూపులు తిప్పుకోలేని అందంతో పాటు, తన చలాకి తనంతో ఎవరైనా బుట్టలో పడేయగలదు ఈ హాట్ బ్యూటీ. మగవాళ్ళతో సమానంగా గేమ్స్ ఆడుతూ, లేడీ టైగర్ గా హౌస్ లో పేరు తెచ్చుకుంది. ఈమెకు హౌస్ లోకి అడుగుపెట్టక ముందు నుండే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఆమె తీరుని చూసి కొత్త ఫ్యాన్స్ కూడా పుట్టుకొచ్చారు. అయితే ప్రేరణ కంభం బెంగళూరు కి చెందిన అమ్మాయి అనే విషయం మన అందరికీ తెలిసిందే. అక్కడ ఈమె మినీ బిగ్ బాస్ షో లో కూడా ఒక కంటెస్టెంట్ గా పాల్గొంది. ఈ షో లో ఆమె తన విషాద ప్రేమకథ గురించి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
ఈ కథ విన్న తర్వాత ఇంత ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ నుండి మళ్ళీ కోలుకొని, పెళ్లి చేసుకొని, సీరియల్స్ చేస్తూ ఇంత హుషారుగా ఈ అమ్మాయి ఎలా తయారైంది అని ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపోక తప్పదు. ఈమెను ఆదర్శంగా తీసుకుంటే ప్రేమ విఫలం అయిన వారు ఆత్మహత్యలు వంటివి చేసుకోరు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈమె బీటెక్ చదువుతున్న రోజుల్లో ఒక అబ్బాయిని పిచ్చిగా ప్రేమించిందట. ఆ అబ్బాయి కూడా ఈమెను ప్రేమించాడు. చివరికి ఇంట్లో పెళ్లి విషయం గురించి చెప్పేందుకు వెళ్లగా, మా అబ్బాయితో పెళ్లి జరిగిన తర్వాత సినిమాలు, సీరియల్స్ వంటివి చేయకూడదు అని చెప్పారట. ఆ అబ్బాయి షరత్తు కూడా అదే. కానీ అందుకు ప్రేరణ ఒప్పుకోలేదు. గొప్ప హీరోయిన్ గా ఎదగాలి అనేది నా జీవిత కల, దానిని వదులుకోలేని అని చెప్పిందట. దీంతో అబ్బాయి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, చాలా వరకు వాళ్ళను ఒప్పించే ప్రయత్నం చేసిందట కానీ కుదర్లేదు. దీంతో తన లవ్ బ్రేకప్ చేసుకుందట. బ్రేకప్ అయిన తర్వాత ప్రేరణ ఆ అబ్బాయిని మర్చిపోలేక చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందట.
ఏ పని చేసేది కాదు, ఇంట్లో అమ్మానాన్నలపై ఊరికే కోపం తెచ్చుకునేదట. ఇలాగే వదిలేస్తే తమ కూతురు ఏమైపోతుందో అని తల్లితండ్రులు చాలా బాధపడేవారట. ఒకరోజు ప్రేరణని అలా చూడలేక ఆమె తల్లి ప్రేరణ కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడిందట. ఈ విషయాన్ని చెప్పుకుంటూ ప్రేరణ ఏడ్చేస్తుంది. ఇక అప్పటి నుండి కెరీర్ మీద ఫోకస్ పెట్టి కన్నడలో వరుసగా హీరోయిన్ గా సీరియల్స్ చేసింది, పలు సినిమాల్లో కూడా నటించింది. అలా తెలుగులో ‘కృష్ణ ముకుంద మురారి’ సీరియల్ ద్వారా మన ఆడియన్స్ కి దగ్గరై నేడు బిగ్ బాస్ 8 లో ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నిల్చింది. గత ఏడాది ఈమె శ్రీపాద్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకుంది.