Actor Sri: సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాలని, అందులో సక్సెస్ అవ్వాలని ప్రతీ ఒక్కరికి ఉంటుంది. ఎందుకంటే చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతీ ఒక్కరిని ఆకర్షించేది సినిమా. ఈ రంగం లోకి వెళ్తే మనకి కూడా బోలెడంత పేరు ప్రఖ్యాతలు వస్తాయని టాలెంట్ ఉన్న ప్రతీ ఒక్కరు సినీ ఇండస్ట్రీ లో రాణించేందుకు ఎంతో కష్టపడుతున్నారు. అయితే ఈ ఇండస్ట్రీ లో టాలెంట్ ఉన్న వాళ్లకు కచ్చితంగా ఇక్కడ స్థానం దొరుకుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు, కానీ టాలెంట్ తో పాటు బోలెడంత అదృష్టం కూడా ఉండాలి. అప్పుడే ఇండస్ట్రీ లో సక్సెస్ ని చూడగలరు. అలా అదృష్టం కలిసిరాక సినిమా ఇండస్ట్రీ ని వదిలి వెళ్లలేక, ఎంతో మంది నటులు ఇండస్ట్రీ లోనే కొనసాగుతూ ఇప్పటికీ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. కానీ సినీ ఇండస్ట్రీ లో అవకాశాలు రాకపోతే సమయం వృధా చేయకుండా, ఇతర రంగాల్లో ఎలా రాణించాలి అనేందుకు ఒక ఉదాహరణ గా నిలిచాడు ‘శ్రీ’.
‘శ్రీ’ అనగానే ఎవరు ఈ హీరో, మేము ఇంత కాలం ఇతని పేరు ఎక్కడ వినలేదే అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. కానీ ‘ఈరోజుల్లో’ సినిమాలోని హీరో అని చెప్తే ఎవరైనా టక్కుమని గుర్తు పట్టేస్తారు. ప్రముఖ దర్శకుడు మారుతి ఈ చిత్రం ద్వారానే ఇండస్ట్రీ కి డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. కొత్త వాళ్ళతో ఆయన తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. వంద రోజులకు పైగా థియేట్రికల్ రన్ ని సొంతం చేసుకొని ఆరోజుల్లోనే ఈ చిత్రానికి 10 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ చిత్రం లో హీరో గా నటించిన శ్రీ కి కూడా మంచి పేరొచ్చింది. ఈ చిత్రం తర్వాత ఆయన ‘అరవింద్ 2’, ‘రయ్ రయ్ ‘ వంటి చిత్రాల్లో హీరో గా నటించాడు.
ఈ సినిమాలు ఆయనకు కమర్షియల్ గా అంతగా పేరు తెచ్చిపెట్టలేదు. ఇక ఆ తర్వాత పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టు గా కూడా చేసాడు. అయితే సినిమాలనే ఈయన జీవితం గా పెట్టుకోలేదు. ఇక్కడ మనకి ఎక్కువ కాలం జీవితం లేదు అనే విషయాన్ని గ్రహించి మోటార్ రంగం లోకి అడుగుపెట్టాడు. స్వయంగా ఒక షెడ్డు ని ఏర్పాటు చేసుకొని, రైతులకు అవసరమయ్యే మోటార్స్ ని తయారు చేసే యంత్రాంగం ని పెట్టుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో ని మీరు క్రింద చూడొచ్చు. ఈ రంగం లో ఆయన పెద్ద రేంజ్ కి ఎదిగాడు, కెరీర్ లో స్థిరపడ్డాడు. గత పదేళ్ల నుండి ఈ రంగం లో కొనసాగుతున్నాడట శ్రీ అలియాస్ మంగం శ్రీనివాస్.