Homeఉద్యోగాలుUPSC NDA 1 Recruitment 2026: ఇంటర్‌ పాస్‌ అయిన వారికి గోల్డెన్‌ ఛాన్స్‌.. ఎన్‌డీఏ...

UPSC NDA 1 Recruitment 2026: ఇంటర్‌ పాస్‌ అయిన వారికి గోల్డెన్‌ ఛాన్స్‌.. ఎన్‌డీఏ దేశ సేవ చేసే అవకాశం

UPSC NDA 1 Recruitment 2026: భారత సాయుధ దళాల్లో ఆఫీసర్‌గా కెరీర్‌ను ప్రారంభించాలనుకునే వారికి ఇది గోల్డెన్‌ ఛాన్స్‌. ఇంటర్‌ పూర్తి చేసిన యువకులకు నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్‌డీఏ) అద్భుతమైనఅవకాశం కల్పిస్తోంది. ఈ పరీక్ష ద్వారా ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో అత్యున్నత స్థాయిలకు ఎదగవచ్చు. 2026కు సంబంధించి తాజా నోటిఫికేషన్‌ విడుదలైంది.

ఎన్‌డీఏ 2026 వన్‌ కీలక వివరాలు..
ఎన్‌డీఏ పరీక్ష ఏటా రెండుసార్లు నిర్వహిస్తుంది. 2026, ఏప్రిల్‌ 12 మొదటి విడత పరీక్ష జరుగుతంది. రెండో విడత పరీక్ష సెప్టెంబర్‌లో జరిగే అవకాశ ఉంది. ఏప్రిల్‌లో 394 పోస్టులకు పరీక్ష జరుగుతుంది. ఇందులో 370 పోస్టులు పురుషులకు, 24 పోస్టులు మహిళలకు కేటాయించారు. అభ్యర్థుల వయసు 16.5 ఏళ్ల నుంచి 19.5 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 2007 జూలై నుంచి 2010 జనవరి 1 మధ్య జన్మించినవారు అర్హులు. ఇంటర్‌ పాస్‌ కావాలి. పట్టుదలతో నాలుగు నెలలు సన్నద్ధమైతే సులభంగా సాధించవచ్చు. ఎన్‌డీఏ ద్వారా జాయిన్‌ అయినవారు భవిష్యత్తులో లెఫ్టినెంట్‌ కల్నల్, మేజర్‌ జనరల్‌ వంటి ఉన్నత పదవులకు చేరుకుంటారు.

పరీక్ష నమూనా, సిలబస్‌ వివరాలు..
పరీక్ష రెండు పేపర్లుగా ఉంటుంది. రాత పరీక్షలో మ్యాథమెటిక్స్‌ (300 మార్కులు), జనరల్‌ అబిలిటీ టెస్ట్‌ (600 మార్కులు). తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. మ్యాథ్స్‌లో అల్జిబ్రా, ట్రిగనామెట్రీ, కాల్కులస్, జ్యామితి, జనరల్‌ అబిలిటీలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, జనరల్‌ సైన్స్, కరెంట్‌ అఫైర్స్, హిస్టరీ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.

సన్నద్ధత కోసం చిట్కాలు..
ప్రస్తుతం నాలుగు నెలల సమయం ఉంది. రోజూ ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ కొనసాగించాలి. నిత్యం 10 నుంచి 12 గంటలు చదవాలు. గత ప్రశ్న పత్రాలను ప్రాక్టిస్‌ చేయాలి. ఇంగ్లిష్‌ ప్రాక్టిస్‌ ఎక్కువగా చేయాలి. UPSC అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 12వ తరగతి పాస్‌ అయి, వయో పరిమితి ఉంటే ఇది ఒక గోల్డెన్‌ ఛాన్స్‌.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular