Anil Ravipudi Remuneration: మన ఇండస్ట్రీ లో రాజమౌళి(SS Rajamouli) తర్వాత నూటికి నూరు శాతం సక్సెస్ రేట్ ఉన్న దర్శకుడు ఎవరు అని అడిగితే మన అందరికీ గుర్తుకొచ్చే పేరు అనిల్ రావిపూడి(Anil Ravipudi). శ్రీను వైట్ల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పని చేసిన అనిల్ రావిపూడి, ఆ తర్వాత స్టోరీ రైటర్ గా కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పని చేసాడు. అలా రచయితగా బిజీ అవుతూ వచ్చిన ఆయన కళ్యాణ్ రామ్ ‘పటాస్’ చిత్రం తో డైరెక్టర్ గా వెండితెర అరంగేట్రం చేసాడు. ఆ సినిమా కమర్షియల్ గా భారీ హిట్ అవ్వడం తో, అనిల్ రావిపూడి తో పని చేయడానికి పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు ఆసక్తి చూపించాయి. అలా ఆ చిత్రం తర్వాత ఆయన చేసిన సుప్రీమ్, రాజా ది గ్రేట్, సరిలేరు నీకెవ్వరూ , F2 , భగవంత్ కేసరి, F3 వంటి చిత్రాలు తెరకెక్కించాడు.
అవన్నీ కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇక ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం కమర్షియల్ ఎంతటి సునామీ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దాదాపుగా 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం. ఈ సినిమా తర్వాత అనిల్ రేంజ్ మారిపోయింది. ఆయన ఎంత డిమాండ్ చేస్తే అంత రెమ్యూనరేషన్ ఇచ్చే నిర్మాతలు ఉన్నారు. అయితే లేటెస్ట్ గా ఆయన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తో ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) అనే చిత్రం చేసాడు. రీసెంట్ గానే షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం, వచ్చే నెల 12 వ తారీఖున సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఆయన జర్నలిస్ట్ మూర్తి కి ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
మూర్తి ఒక ప్రశ్న అడుగుతూ ‘ఈ సినిమాకు మీరు పాతిక కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకున్నారని టాక్ వినిపిస్తుంది. అది నిజమే అంటారా?’ అని అడగ్గా, దానికి అనిల్ రావిపూడి సమాధానం చెప్తూ ‘అది నిజమో కాదో మీరే నిర్మాత ని అడగండి, మీకు తెలుసు కదా. నేను అంత రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం లో న్యాయం ఉంది. కానీ నేను అంత రెమ్యూనరేషన్ తీసుకోలేదు. బడ్జెట్ కి తగ్గట్టే తీసుకున్నాను. నేను రెమ్యూనరేషన్ విషయం లో అంత కచ్చితంగా ఉండే వ్యక్తిని కాదు’ అంటూ చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా ఈ సినిమా కు కేవలం ఆర్టిస్టుల రెమ్యూనరేషన్స్ మొత్తం కలిపి 160 కోట్ల రూపాయిల వరకు ఉంటుందని కూడా ఆయన చెప్పుకొచ్చాడు.