spot_img
Homeఎంటర్టైన్మెంట్VIjay Sethupathi: ఆ కారణం వల్లే నటుడు విజయ్ సేతుపతిపై దాడి...

VIjay Sethupathi: ఆ కారణం వల్లే నటుడు విజయ్ సేతుపతిపై దాడి…

VIjay Sethupathi: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదనే చెప్పాలి.  తెలుగులో విడుదలైన మాస్టర్, ఉప్పెన సినిమాలతో విజయ్ కి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ వచ్చిందనే చెప్పాలి. ఇటీవల ఆయన నటించిన లాభం, ఆనబెల్ సేతుపతి చిత్రాలను తెలుగులో కూడా విడుదల చేశారు. అయితే  సేతుపతిపై బెంగ‌ళూరు ఎయిర్‌పోర్టులో ఓ వ్య‌క్తి దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా కూడా మారింది.  తెలుగు, త‌మిళ నాట‌ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న అతనిని  ఓ వ్యక్తి ఎగిరి తన్నడం ఆయన అభిమానులకు ఎంతో బాధను కలిగించింది.

interesting details about stranger attack on vijay sethupathi in bangalore airport

కాగా ఈ దాడి  చేయ‌డం వెన‌కాల గ‌ల కార‌ణాలపై ర‌క‌ర‌కాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ ఇప్పుడు మ‌రో కార‌ణం తెర‌పైకి వ‌చ్చింది. విజ‌య్‌పై దాడి చేసిన వ్య‌క్తి పేరు జాన్సన్ అని… బెంగ‌ళూరులో నివాస‌ముండే ఇత‌డు మ‌ల‌యాళీవాసి అని తెలుస్తోంది. విజయ్ తో సెల్ఫీ కోసం ప్ర‌య‌త్నించ‌గా అతన్ని… విజయ్ అసిస్టెంట్లు అడ్డుకున్నారు. ఈ మేరకు వారి మధ్య చిన్న వాగ్వాదం తలెత్తిందని అందుకే అది మనసులో పెట్టుకొని ఆవేశంతో విజ‌య్‌ను త‌న్నాడు అని తెలుస్తుంది. ఆ వెంటనే అతన్ని విజయ్ సేతుపతి టీమ్ సభ్యులు అడ్డుకోవడం తెలిసిందే. కాగా ఆ వ్యక్తి విజ‌య్ సేతుప‌తికి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన‌ట్లు స‌మాచారం. అలానే అతనిపై ఎలాంటి కేసు నమోదు చేయొద్దని విజయ్ సేతుపతి కోరినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో  చక్కర్లు కొడుతుంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...
Oktelugu Epaper
Exit mobile version