https://oktelugu.com/

Balayya Akhanda Movie: బాలయ్య ‘అఖండ’ సీక్వెల్ కథ అదే !

Balayya Akhanda Movie: అఖండతో బాక్సాఫీస్ పై బాలయ్య దండయాత్ర మరో వారం ఉండేలా ఉంది. ఈ రోజుల్లో ఒక సినిమాకి ఒక వారం పాటు పడిపోకుండా కలెక్షన్స్ రావడం అంటే.. అది చాలా గొప్ప విషయం. కానీ, అఖండకు మాత్రం రెండో వారం కూడా కంటిన్యూగా కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ విజయం ఒక్క బాలయ్యదే కాదు, బోయపాటిది. నిజానికి ఈ సినిమాకి ముందు వరకూ స్టార్ హీరోలు బోయపాటిని తమ రానున్న సినిమాల దర్శకుల లిస్ట్ […]

Written By:
  • Shiva
  • , Updated On : December 9, 2021 / 04:58 PM IST
    Follow us on

    Balayya Akhanda Movie: అఖండతో బాక్సాఫీస్ పై బాలయ్య దండయాత్ర మరో వారం ఉండేలా ఉంది. ఈ రోజుల్లో ఒక సినిమాకి ఒక వారం పాటు పడిపోకుండా కలెక్షన్స్ రావడం అంటే.. అది చాలా గొప్ప విషయం. కానీ, అఖండకు మాత్రం రెండో వారం కూడా కంటిన్యూగా కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ విజయం ఒక్క బాలయ్యదే కాదు, బోయపాటిది. నిజానికి ఈ సినిమాకి ముందు వరకూ స్టార్ హీరోలు బోయపాటిని తమ రానున్న సినిమాల దర్శకుల లిస్ట్ లో రాసుకోలేదు.

    Balayya Akhanda Movie

    కానీ ఇప్పుడు అఖండ సాధించిన అఖండ విజయం దెబ్బకు బోయపాటి మళ్ళీ ఫేవరేట్ డైరెక్టర్ అయిపోయాడు. ఎవర్నీ అడిగినా బోయపాటితో ఒక సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే, బోయపాటి మాత్రం తన తర్వాత సినిమాను బన్నీతో ఖాయం చేసుకున్నాడు. కాబట్టి.. వచ్చే ఏడాది వరకూ బిజీ. మరి ఆ తర్వాత.. చరణ్ తో ఒక సినిమా చేస్తాడు అని టాక్ నడుస్తోంది.

    అలాగే బాలయ్య – బోయపాటి కాంబో హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది కాబట్టి.. అఖండకు సీక్వెల్ తెరకెక్కిస్తే బాగుంటుందని బాలయ్య అభిమానులు, సన్నిహితులు బలంగా కోరుకుంటున్నారు. ఎలాగూ అఖండ సినిమాలో అఘోర పాత్రదారి పాపతో ఒక డైలాగ్ చెబుతాడు. నీకు ఎపుడైనా, ఏ క్షణమైనా కష్టం అనిపిస్తే నన్ను తల్చుకో.. నీ ముందు ఉంటా’ అంటూ బాలయ్య అభయం ఇస్తాడు.

    Also Read: ఎందుకు అన్నీ బూతులు ? ఫ్యామిలీ నెటిజన్ల కామెంట్లు !

    కాబట్టి, సీక్వెల్ కథను ఆ పాపకి వచ్చే ఆపదల పాయింట్ ఆఫ్ వ్యూలో రాసుకుని తీసేయొచ్చు. అప్పుడు సినిమా కూడా చాలా బాగా వస్తోంది. ఇప్పటికే బోయపాటికి కూడా తన మైండ్ లో ఈ సీక్వెల్ కి సంబంధించిన ఒక ఐడియా ఉందట. ప్రస్తుతానికి బాలయ్య రెండు బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కమిట్ అయ్యాడు. కమిటైన ఆ సినిమాలు పూర్తి చేయడానికి మరో ఏడాది పడుతుంది.

    ఇక ఈ లోపు బోయపాటి, బన్నీతో సినిమా చేసుకుని బాలయ్య అఖండ సినిమా సీక్వెల్ పైకి వస్తాడు. ఏది ఏమైనా ఈ సారి అఖండ సాధించిన అద్భుత విజయంతో బాలయ్య ఫ్యాన్స్ సంక్రాంతిను ముందే జరుపుకుంటున్నారు. వారం మధ్యలో కూడా అఖండ థియేటర్స్ వద్ద కోలాహలం నెలకొంది.

    Also Read: సింహాద్రి అప్పన్న సేపలో బాలయ్య

    Tags