Bigg Boss 6 Telugu- Raj Remuneration: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ లో మొదటి మూడు వారాల్లోనే ఎలిమినేట్ అయిపోతారు అనుకున్న కంటెస్టెంట్స్ ఇప్పుడు చివరి వరుకు రావడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది..ఇనాయ సుల్తానా అయితే రెండవ వారం లోనే ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్..ఆమె అదృష్టం కొద్దీ ఆ వారం ఎలిమినేషన్ రద్దు చెయ్యడం..ప్రస్తుతం ఆమె టైటిల్ కొట్టే రేంజ్ ఫాలోయింగ్ తెచ్చుకోవడం అన్ని అలా జరిగిపోయాయి..రాజ్ పరిస్థితి కూడా అలాంటిదే..ఇతను కూడా మొదట్లోనే ఎలిమినేట్ అయ్యిపోతారని అందరూ అనుకున్నారు.

కానీ క్రమక్రమంగా ఆయన తన ఆటతీరుని మెరుగుపర్చుకుంటూ ఫిజికల్ టాస్కు దగ్గర నుండి ఎంటర్టైన్మెంట్ పంచడం వరుకు ప్రతీ కోణం లో ఆయన నేను టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకడిగా నిలబడడానికి అర్హుడిని అని అనిపించుకునేలా ప్రవర్తించాడు..కానీ నిన్న జరిగిన రాజ్ ఎలిమినేషన్ పూర్తిగా అతని బ్యాడ్ లక్ అనే చెప్పొచ్చు..’ఏవిక్షన్ ఫ్రీ పాస్’ ఉండడం వల్ల ఫైమా సేఫ్ అయ్యి రాజ్ ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది.
ఫైమా ఆ ‘ఏవిక్షన్ ఫ్రీ పాస్’ ని నీకే వాడుతాను, నువ్ సేఫ్ అవ్వు..నీకోసమే ఆ ఏవిక్షన్ ఫ్రీ పాస్ ని గెల్చుకున్నాను అని చెప్తుంది..కానీ ఎంత బ్రతిమిలాడినా రాజ్ ఆ ఏవిక్షన్ ఫ్రీ పాస్ ని తీసుకోవడానికి ఇష్టపడడు..వోటింగ్ ప్రకారమైతే ఫైమా కి అందరికంటే అతి తక్కువ ఓట్లు వచ్చాయి..రాజ్ కి ఆమె కంటే కాస్త ఎక్కువ ఓట్లు పడ్డాయి..అంటే పేక్షకుల తీర్పు ప్రకారం రాజ్ ఎలిమినేట్ అవ్వలేదు..కానీ ఫైమా మాత్రం తానూ గెల్చుకున్న ‘ఏవిక్షన్ ఫ్రీ పాస్’ వల్ల సేఫ్ అయిపోయింది..ఇకపోతే 12 వారాలకు గాను రాజ్ కి వచ్చిన రెమ్యూనరేషన్ గురించి సోషల్ మీడియా ఒక చర్చ నడుస్తుంది.

రాజ్ కి పెద్దగా పాపులారిటీ లేకపోవడం వల్ల అతనికి రెమ్యూనరేషన్ మొదటి మూడు వారాలు వారానికి 12 వేలు మాత్రమే ఇస్తామని బిగ్ బాస్ టీం ఒప్పందం కుదుర్చుకుందట..ఆ మూడు వారాలు అతను నిలదొక్కుకొని ముందుకు సాగే పరిస్థితులు కనిపిస్తే కచ్చితంగా పారితోషికం పెంచుతామని మాట ఇచ్చారట..ఇచ్చిన మాట ప్రకారం నాల్గవ వారం నుండి రాజ్ రెమినేరషన్ వారానికి 8 వేలు పెరిగింది..అలా ఆయన 12 వారాలు హౌస్ లో ఉన్నాడు కాబట్టి, ఈ 12 వారాలకు గాను బిగ్ బాస్ టీం అతనికి రెండు లక్షల 40 వేల రూపాయిలు ఇచ్చినట్టు సమాచారం.
ఇప్పటి వరుకు ఎలిమినేట్ అయినా కంటెస్టెంట్స్ అందరికి ఇదే స్థాయి రెమ్యూనరేషన్స్ ఇచ్చారు..ఒక బాలాదిత్య రెమ్యూనరేషన్ మాత్రం పర్వాలేదు అనిపించింది..ఆయనకీ దాదాపుగా ఆరు లక్షల రూపాయిలు ఇచ్చారు..కానీ మిగిలిన కంటెస్టెంట్స్ కి మాత్రం 2 నుండి 4 లక్షల లోపే రెమ్యూనరేషన్స్ ఇచ్చారు..క్యాష్ ప్రైజ్ సైతం బాగా తగ్గించేశారు..బిగ్ బాస్ షో ప్రారంభం లో తక్కువ TRP రేటింగ్స్ రావడం వల్ల నష్టాలు బాగా వచ్చాయి..ఆ నష్టాలను పూడ్చడానికే రెమ్యూనరేషన్స్ మరియు క్యాష్ ప్రైజ్ లో కోత వేస్తున్నారని చెప్తున్నారు విశ్లేషకులు.