Prabhas: ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలలో పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ స్టార్ ఇమేజి ని సొంతం చేసుకున్న మొట్టమొదటి హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్..బాహుబలి సినిమాకి ముందు కేవలం టాలీవుడ్ కి మాత్రమే పరిమితమైన ప్రభాస్..ఆ సినిమా తర్వాత ఆయన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రస్తుతం ఏ రేంజ్ లో మనం చూస్తూనే ఉన్నాము..అయితే ప్రభాస్ కి ఈ రేంజ్ స్టార్ స్టేటస్ రావడానికి ప్రధాన కారణాలలో యాక్టింగ్ తో పాటు ఆయన అందం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు.

అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ లుక్స్ బాగా దెబ్బ తిన్నాయి..క్షణం తీరిక లేకుండా ప్రభాస్ సినిమాలు చేస్తుండడం వల్లే లుక్స్ దెబ్బ తింటున్నాయని అభిమానులు అంటుంటారు..ప్రభాస్ ప్రస్తుతం మూడు సినిమాల్లో ఒకేసారి డిఫరెంట్ షెడ్యూల్స్ లో చేస్తున్నాడు..ఒకటి ప్రశాంత్ నీల్ తో సలార్, మరొకటి నాగ అశ్విన్ తో ప్రాజెక్ట్ K మరియు యంగ్ డైరెక్టర్ మారుతి తో ప్రస్తుతం మరో సినిమా..ఈ మూడు సినిమాలు చేస్తున్నాడు.
అదంతా పక్కన పెడితే ప్రభాస్ ఈమధ్య ఎక్కడికెళ్లినా నెత్తి మీద ఒక ‘బాబా’ లాగ ఒక విచిత్రమైన క్యాప్ ని పెట్టుకొని తిరుగుతున్నాడు..ఇది చూసిన ప్రతి ఒక్కరికి ప్రభాస్ ఎందుకు ఇలా తిరుగుతున్నాడు..ఆయనకీ ఏమైనా ‘బట్టతల’ వచ్చిందా..విగ్గు లేని సమయం లో అలా క్యాప్ పెట్టుకొని తిరుగుతున్నాడా అనే సందేహాలు తలెత్తాయి..అయితే అలాంటిదేమి లేదని , ప్రభాస్ వరుసగా క్షణం తీరిక లేకుండా సినిమాలు చేస్తుండడం వాళ్ళ వివిధ రకాల హెయిర్ స్టైల్స్ తో ఉంటాడు..అవి బయటకి రెవీల్ చెయ్యడానికి వీలు లేదు..అందుకే ఆయన దానిని కవర్ చేసుకోవడానికి తలకి క్యాప్ పెట్టుకొని తిరుగుతున్నాడు అంటూ ప్రభాస్ సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి.

దీనితో ప్రభాస్ కి బట్టతల అంటూ గత కొద్దీ రోజుల నుండి సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న వార్తలకు తెరపడింది..ప్రభాస్ సలార్ మూవీ పోస్టర్స్ లో హాలీవుడ్ యాక్షన్ హీరో ని తలపించే విధంగా ఉన్నాడు..లుక్స్ అదిరిపోయాయి..కానీ ఆదిపురుష్ లుక్స్ బాగా దెబ్బతిన్నాయి..ప్రాజెక్ట్ K ఫస్ట్ లుక్ ఇంకా విడుదల కాలేదు కాబట్టి ఈ సినిమా లో ప్రభాస్ లుక్ ఎలా ఉండబోతుంది అనేది తెలీదు.