Radhe Shyam: కరోనా మూడో వేవ్ దెబ్బకు మళ్ళీ భారీ సినిమాలు వాయిదా వైపు అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ విడుదల వాయిదా అనేది అధికారం అయిపోయింది. తాజాగా ‘రాధేశ్యామ్’ కూడా అదే బాటలో నడవబోతున్నాడు అని ప్రచారం జరుగుతుంది. కాకపోతే, ‘రాధేశ్యామ్’ మేకర్స్ మాత్రం ఈ విషయం పై ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. పైగా వాయిదా లాంటిదేమి లేదంటున్నారు.
ముందు ప్రకటించిన విధంగానే తమ సినిమాను జనవరి 14వ తేదీనే రిలీజ్ చేస్తామని చెబుతున్నారు. కానీ, ఆ చెబుతుంది మెయిన్ నిర్మాతలు కాదు. నిర్మాణ సంస్థ లోని రెండవ స్థాయి బృందం వారు. మరి వీరి మాటలను బట్టి ‘ప్రస్తుతానికి’ విడుదల తేదీలో ఎలాంటి మార్పు ఉండదు అని తెలిసిపోయింది. కానీ బయ్యర్లలో మాత్రం టెన్షన్ పెరుగుతూ ఉంది.
‘ప్రస్తుతానికి’ థియేటర్స్ ఓపెన్ లోనే ఉన్నాయి. ఒకవేళ రానున్న వారంలో కోవిడ్ కేసులు మరింతగా పెరిగితే ఏమిటి పరిస్థితి ? అసలుకే ఏపీ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ పై సీరియస్ గా ఉంది. మహారాష్ట్రలో వస్తున్న విధంగానే ఇటు తెలంగాణాలో అటు ఆంధ్ర ప్రదేశ్ లో కేసుల సంఖ్య అమాంతం పెరిగితే ఇక థియేటర్లను మూసివేసుకోవడమే.
Also Read: Akhil Akkineni: కండలతో పాటు బడ్జెట్ పెంచితే కష్టం కదా !
ఆ పరిస్థితి వస్తే సినిమాకి భారీ నష్టం ఉంటుంది. అందుకే, జనవరి 7న విడుదల కావాల్సిన “ఆర్ఆర్ఆర్” కూడా వాయిదా నిర్ణయం తీసుకుంది. మరి ‘రాధేశ్యామ్’ మేకర్స్ కూడా జనవరి 7, 8వ తేదీన పరిస్థితిని గమనించి తమ సినిమా రిలీజ్ విషయంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ జనవరి 14న సినిమాని విడుదల చేయకపోతే మిగిలిన పెద్ద సినిమాలకు లైన్ క్లియర్ చేసినట్టే.
Also Read: Abhinav Gomatam: హీరో అవతారం ఎత్తుతున్న మరో కమెడియన్ !