https://oktelugu.com/

ఎక్స్ పోజింగ్ లో బోర్డర్స్ దాటిన ‘ఇందువదన’!

‘ఇందువదన’ అనే టైటిల్ తో ఫేడ్ అవుట్ హీరో ‘వరుణ్ సందేశ్’ ఓ సినిమా చేస్తున్నాడు. కాగా తాజాగా ఈ సినిమా నుండి ఇందు పాత్ర తాలూకు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. క్లాసిక్ లుక్ లో బోల్డ్ స్టిల్ ఇస్తూ కనిపిస్తున్న హీరోయిన్ ‘ఫర్నాజ్ శెట్టి’ మొత్తానికి నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. మొదటి సినిమాతోనే ఎక్స్ పోజింగ్ విషయంలో గేట్లును ఫుల్ గా ఓపెన్ చేసినట్టు ఉంది ఫర్నాజ్ శెట్టి. ఏ […]

Written By:
  • admin
  • , Updated On : June 27, 2021 / 05:34 PM IST
    Follow us on

    ‘ఇందువదన’ అనే టైటిల్ తో ఫేడ్ అవుట్ హీరో ‘వరుణ్ సందేశ్’ ఓ సినిమా చేస్తున్నాడు. కాగా తాజాగా ఈ సినిమా నుండి ఇందు పాత్ర తాలూకు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. క్లాసిక్ లుక్ లో బోల్డ్ స్టిల్ ఇస్తూ కనిపిస్తున్న హీరోయిన్ ‘ఫర్నాజ్ శెట్టి’ మొత్తానికి నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. మొదటి సినిమాతోనే ఎక్స్ పోజింగ్ విషయంలో గేట్లును ఫుల్ గా ఓపెన్ చేసినట్టు ఉంది ఫర్నాజ్ శెట్టి.

    ఏ మాత్రం మొహమాటం లేకుండా ఈ సినిమాలో సెమీ న్యూడ్ గా నటించి, తెలుగు కుర్రాళ్ల మీదకు తన మన్మధ బాణాలను సంధిస్తోంది. మొత్తమ్మీద ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ అదిరిపోయిందనే చెప్పాలి. ముఖ్యంగా ఫర్నాజ్ శెట్టి లుక్ ఊహించని విధంగా ఉండటంతో పాటు సినిమా పై ఆసక్తిని పెంచింది. ఇక ఈ బోల్డ్ లుక్ ను బట్టి ఇదొక రొమాంటిక్ మూవీలా అనిపిస్తోంది.

    మరి ఇంత బోల్డ్ మూవీని నిర్మిస్తోన్న వ్యక్తి ఒక లేడీ కావడం విశేషం. ఆమె పేరు మాధవి ఆదుర్తి. శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌ పై ఎంఎస్ఆర్ దర్శకత్వంలో మాధవి ఆదుర్తి ఈ ‘ఇందువదన’ను చక్కగా యూత్ ను టార్గెట్ చేస్తూ నిర్మిస్తోంది. ఇక చాలా ఏళ్ళ తర్వాత ఇందువదన సినిమాతోనే రీఎంట్రీ ఇస్తున్న వరుణ్ సందేశ్ కి, ఈ సినిమా లైఫ్ అండ్ డెత్ లాంటిది. అందుకే వరుణ్ సందేశ్ కూడా ఈ సినిమా కోసం బాగానే కష్టపడుతున్నాడు.

    ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. లాస్ట్ వీక్ హైద‌రాబాద్ సార‌ధి స్టూడియోస్ లో భారీగా వేసిన సెట్స్ లో ఈ సినిమా క్లైమాక్స్ ను గ్రాండ్ గా తెరకెక్కించారు. అన్నట్టు ఈ సినిమాకు కథ, మాటలు సతీష్ ఆకేటీ అందిస్తున్నాడు. అలాగే శివ కాకాని సంగీతం సమకూరుస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల వివరాలను తెలియజేస్తామని మేకర్స్ తెలియజేశారు.