https://oktelugu.com/

యూనివర్సిటీలకు అమరావతి ఎందుకు వద్దో?

అమరావతిలో వెలసిన రెండు ప్రముఖ విద్యాసంస్థలు సమస్యలు ఎదుర్కొంటున్నాయి. గత తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో ఏర్పాటు చేసిన పెద్ద యూనివర్సిటీలు నెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఈ రెండు కాలేజీల్లో అత్యున్నత స్థాయి ప్రమాణాలు పాటిస్తున్నారు. ఇవి రెండు అమరావతిలో ఉన్నాయి. ఇవి రెండు అమరావతిలో క్యాంపస్ పెట్టిన తరువాత అడ్మిషన్లు హాట్ కేకుల్లాగా అయిపోయాయి. మొదటి బ్యాచ్ బయటకొచ్చింది. వందకు వంద శాతం ప్లేస్ మెంట్లతో అత్యధిక విజయాలు నమోదు చేశారు. కానీ […]

Written By: , Updated On : June 27, 2021 / 05:24 PM IST
Follow us on

Amaravatiఅమరావతిలో వెలసిన రెండు ప్రముఖ విద్యాసంస్థలు సమస్యలు ఎదుర్కొంటున్నాయి. గత తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో ఏర్పాటు చేసిన పెద్ద యూనివర్సిటీలు నెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఈ రెండు కాలేజీల్లో అత్యున్నత స్థాయి ప్రమాణాలు పాటిస్తున్నారు. ఇవి రెండు అమరావతిలో ఉన్నాయి. ఇవి రెండు అమరావతిలో క్యాంపస్ పెట్టిన తరువాత అడ్మిషన్లు హాట్ కేకుల్లాగా అయిపోయాయి. మొదటి బ్యాచ్ బయటకొచ్చింది.

వందకు వంద శాతం ప్లేస్ మెంట్లతో అత్యధిక విజయాలు నమోదు చేశారు. కానీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చింది. కానీ రెండు యూనివర్సిటీల పేర్ల ముందు అమరావతి అనే పదమే కనిపించలేదు. విట్ ఆంధ్రప్రదేశ్, ఎస్ఆర్ఎం ఆంధ్రప్రదేశ్ అని సంబోధిస్తున్నారు.

విట్ అయినా ఎస్ఆర్ఎం అయినా ఎక్కడ క్యాంపస్ పెడితే అక్కడి ఊరి పేరుతో క్యాంపస్ ను నిర్వహిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం అమరావతికి బదులు ఆంధ్రప్రదేశ్ అని పెట్టడంలో రాజకీయ కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. దీంతో అధికార పార్టీ నాయకులకు తలొగ్గి యాజమాన్యాలు పేరు చివర ఆంధ్రప్రదేశ్ అని పెడుతున్నాయి. దీంతో యాజమాన్యాలు సైతం సర్కారు చర్యలను వ్యతిరేకిస్తున్నాయి.

ఇక మీదట ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ కూడా సంస్థలు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా లేమని చెప్పకనే చెబతున్నాయి. రెండు సంస్థలకు మంత్రుల స్థాయిలో బెదిరింపులు వచ్చినట్లు రుజువు అయింది. ప్రభుత్వంతో ఎందుకొచ్చిన గొడవ అనే ఉధ్దేశంతో యూనివర్సిటీలు ఆ పేర్లే పెట్టుకోవడంతో యాజమాన్యాల తీరులో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అమరావతి పేరు పెడితే మరిన్ని విద్యాసంస్థలు వచ్చేవని నిర్వాహకులు పేర్కొంటున్నారు.